- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రమాదవశాత్తు బావిలో పడి వ్యక్తి మృతి - ధర్మారం మండలం పెర్కపల్లిలో విషాదం
- ధర్మారం మండలం పెర్కపల్లిలో విషాదం

ప్రమాదవశాత్తు బావిలో పడి వ్యక్తి మృతి
- ధర్మారం మండలం పెర్కపల్లిలో విషాదం
దిశ, ధర్మారం: ప్రమాదవశాత్తు బావిలో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన ధర్మారం మండలంలోని పెర్కపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ ప్రవీణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన గుండేటి మల్లేశం (43) వ్యవసాయ బావి ఒడ్డున గడ్డి కోస్తుండగా ప్రమాదవశాత్తు బావిలో పడిపోయి ఈత రాకపోవటంతో నీటిలో మునిగి మృతి చెందాడు. గడ్డి కోసం వెళ్లిన భర్త తిరిగి ఇంటికి రాకపోవడంతో భార్య లత భర్త కోసం వెతుకుతూ వెళ్లగా వ్యవసాయ బావిలో మృతి చెంది కనిపించాడు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటికి తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య లత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు.






