జీవితంపై విరక్తి చెంది వ్యక్తి ఆత్మహత్య

by Elthuri vijay kumar |

జీవితంపై విరక్తి చెంది వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ధర్మారం మండలంలోని పత్తిపాక గ్రామంలో జరిగింది.

జీవితంపై విరక్తి చెంది వ్యక్తి ఆత్మహత్య
X

జీవితంపై విరక్తి చెంది వ్యక్తి ఆత్మహత్య

దిశ,ధర్మారం: జీవితంపై విరక్తి చెంది వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ధర్మారం మండలంలోని పత్తిపాక గ్రామంలో జరిగింది. గోపాలరావుపేట మండలం రామడుగు గ్రామానికి చెందిన దాసరి రాజశేఖర్ (34)కు పెళ్లి అయి పదేళ్లవుతోంది. అప్పటి నుండి పిల్లలు పుట్టకపోవడంతో మనస్తాపానికి గురైన రాజశేఖర్ ధర్మారం మండలంలోని పత్తిపాక గ్రామంలోని ఆయన పెద్దమ్మ ఇంటికి వెళ్లి చెరువు కట్ట వద్ద గడ్డి మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన స్థానికులు కరీంనగర్ ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మరణించాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ధర్మారం ఎస్సై ప్రవీణ్ కుమార్ తెలిపారు.

Next Story