- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తంగళ్లపల్లిలో కలకలం.. స్టేషన్ ఆవరణలో వ్యక్తి ఆత్మహత్యాయత్నం
by Bhanu |
పోలీసులు తనపై అక్రమంగా కేసు పెట్టారంటూ స్టేషన్ ఆవరణలో ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన తంగళ్ళపల్లి మండల కేంద్రంలో చోటుచేసుకుంది..

X
దిశ, తంగళ్లపల్లి : పోలీసులు తనపై అక్రమంగా కేసు పెట్టారంటూ స్టేషన్ ఆవరణలో ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన తంగళ్ళపల్లి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. మండలంలోని చీర్లవంచ గ్రామానికి చెందిన వెలుపుల కృష్ణ అనే వ్యక్తి భూ పంచాయతీ విషయంలో ఎస్ఐ తనపై కేసు నమోదు చేశాడని పోలీస్ స్టేషన్ కు చేరుకొని ఆవేదన వ్యక్తం చేశారు.
స్టేషన్ సిబ్బంది చూస్తుండగానే తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగడంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ఎస్సై డబ్బులు తీసుకొని తనపై అక్రమంగా కేసు పెట్టాడని ఆరోపించడం గమనార్హం. పురుగుల మందు తాగిన వ్యక్తిని సిబ్బంది వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తంగళ్ళపల్లి మండలంలో పోలీసులపై ఆరోపణలు చేస్తూ వరసగా చోటు చేసుకుంటున్న ఇలాంటి ఘటనలు రాజన్న సిరిసిల్ల జిల్లాలో సంచలనం రేపుతున్నాయి.
Next Story






