స్వస్థలానికి వచ్చిన మల్లోజుల.. ఇరుగుపొరుగుతో ముచ్చట

by Jakkula.Mamatha |

మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా, పొలిట్ బ్యూరో మెంబర్ గా దశాబ్దాల కాలం ఉద్యమ జీవితాన్ని గడిపిన మల్లోజుల వేణుగోపాల్ రావు జనజీవన స్రవంతిలో కలిసాక మొదటి సారి ఆదివారం ఉదయం ఆయన స్వస్థలం పెద్దపల్లికి వచ్చారు.

స్వస్థలానికి వచ్చిన మల్లోజుల.. ఇరుగుపొరుగుతో ముచ్చట
X

దిశ, కరీంనగర్ బ్యూరో: మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా, పొలిట్ బ్యూరో మెంబర్ గా దశాబ్దాల కాలం ఉద్యమ జీవితాన్ని గడిపిన మల్లోజుల వేణుగోపాల్ రావు జనజీవన స్రవంతిలో కలిసాక మొదటి సారి ఆదివారం ఉదయం ఆయన స్వస్థలం పెద్దపల్లికి వచ్చారు. సుమారు నాలుగున్నర దశాబ్దాలుగా మావోయిస్టు పార్టీలో కొనసాగిన ఆయన గత ఏడాది అక్టోబర్ లో మహారాష్ట్ర సీఎం సమక్షంలో లొంగిపోయిన తెలిసిందే. అయితే ఆయన లొంగుబాటు తర్వాత ఎప్పుడెప్పుడు ఇక్కడకు వస్తారా అని ఎదురు చూసిన ఆయన బంధువులకు ఈ రోజు ఉదయాన్నే ఆయన రావడం బాగున్నారా అంటూ పలకరించి చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకోవడం పై స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మల్లోజుల సోదరుడు అంజయ్య అనారోగ్యంతో బాధపడుతున్నాడని విషయం తెలుసుకున్న ఆయన సోదరునికి పకమార్శించేందుకు పెద్దపల్లికి వచ్చినట్టు తెలుస్తుంది మల్లోజుల వేణుగోపాల్ రావు వచ్చిన విషయం తెలుసుకున్న బంధుమిత్రులు అక్కడికి వచ్చి ముచ్చటిస్తూ సంబరపడ్డారు.వాస్తవంగా మల్లోజుల లొంగుబాటు తర్వాత కూడా మహారాష్ట్రలోని గడ్చిరోలికి పరిమితమయ్యాడు దీంతో పెద్దపల్లికి ఎప్పుడు వస్తాడా అంటు స్థానికంగా ఎదురుచూసిన వారికి అకస్మాత్తుగా పెద్దపల్లిలో ప్రత్యక్ష్యం అవడం వారిని ఆశ్చర్యానికి గురిచేసింది.పెద్దపల్లికి కట్టుదిట్టమైన భద్రత (మఫ్టి )పోలీసుల మధ్య రావడం ఆయన పర్యటన అంతా మహారాష్ట్ర పోలిసుల కనుసన్నల్లోనే జరుగుతుంది. మఫ్టీలో వచ్చిన పోలీసులు ప్రతిది సునిశితంగా పరిశీలిస్తున్నారు. అయితే మల్లోజుల వేణుగోపాల్ రావుతో మీడియా ప్రతినిధులు మాట్లాడేందుకు ప్రయత్నించగా ఆయన నిరాకరించారు.

Next Story