మాతా శిశు కేంద్రాన్ని మహత్తరంగా తీర్చిదిద్దండి : కలెక్టర్ చిత్రా మిశ్రా

by Nallavelli.Anjaneyulu |

కరీంనగర్ మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని మరింత మహత్తరంగా తీర్చేదిద్దాలని.. ఇందుకోసం వైద్యాధికారులు, వైద్య నిపుణులు కష్టపడి పని చేయాలని కలెక్టర్ చిత్రా మిశ్రా సూచించారు.

మాతా శిశు కేంద్రాన్ని మహత్తరంగా తీర్చిదిద్దండి :   కలెక్టర్ చిత్రా మిశ్రా
X

దిశ‌, క‌రీంన‌గ‌ర్ క‌లెక్ట‌రేట్ : కరీంనగర్ మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని మరింత మహత్తరంగా తీర్చేదిద్దాలని.. ఇందుకోసం వైద్యాధికారులు, వైద్య నిపుణులు కష్టపడి పని చేయాలని కలెక్టర్ చిత్రా మిశ్రా సూచించారు. కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా చిన్నారులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని పేర్కొన్నారు. 99 రోజుల యాక్షన్ ప్లాన్ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో బుధవారం నిర్వహించిన సేఫ్ మదర్స్ డే కార్యక్రమానికి కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాతా శిశు కేంద్రంలో అన్ని విభాగాలను సందర్శించారు. గైనకాలజిస్టులు పిల్లల వైద్య నిపుణులు రేడియాలజిస్టులతో చిన్నారులకు అందిస్తున్న వైద్య సేవలపై సమీక్ష నిర్వహించారు. చిన్నారుల సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యంగా వైద్యులు పనిచేయాలని సూచించారు.

అదనంగా ఏమైనా అవసరాలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని పేర్కొన్నారు. మెటర్నిటీ వార్డులు స్పెషల్ న్యూ బోర్న్ కేర్ యూనిట్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా పిల్లలకు అందిస్తున్న పోషకాహారానికి సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోషకాహార లోపంతో బాధపడుతున్న చిన్నారులకు సమయానికి పోషకాహారం అందించాలని ఆదేశించారు. పోషకాహారానికి సంబంధించి ఎప్పటికప్పుడు ఇండెంటు సరిచూసుకోవాలన్నారు. సమయానికి చిన్నారులకు ఆహారం అందించాలని, వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సూచించారు. అదేవిధంగా డిస్టిక్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ (డిఈఐసి) ను జిల్లా కలెక్టర్ పర్యవేక్షించారు. ప్రత్యేక అవసరాలు కలిగిన చిన్నారులు.. వివిధ వ్యాధులతో చికిత్స పొందుతున్న వారు.. శారీరకంగా మానసికంగా ఎదుగుదల తక్కువ ఉన్నవారు పుట్టుకతో వచ్చిన సమస్యలతో బాధపడుతున్న చిన్నారులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ వైద్య బృందానికి సూచించారు. వారికి అన్ని విధాలుగా వైద్య సేవలు అందించాలని ప్రైవేట్ ఆస్పత్రిలకు దీటుగా ఏమైనా వైద్య పరికరాలు అవసరం ఉంటే మంజూరు చేయించేందుకు కృషి చేస్తామని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.


చిన్నారుల సంపూర్ణ ఆరోగ్య పరిరక్షనే ధ్యేయంగా విధులు నిర్వర్తించాలని చెప్పారు. చిన్నారులకు ఏ లోటు రాకుండా చూడాల్సిన బాధ్యత వైద్యులపై ఉందన్నారు. ఏ ఇబ్బంది వచ్చినా తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. మొత్తానికి కరీంనగర్ మాత శిశు ఆరోగ్య కేంద్రం అంటే చిన్నారుల వైద్య సంరక్షణ విషయంలో మంచి గుర్తింపు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకు మాతా శిశు ఆరోగ్య కేంద్రం వైద్య నిపుణులు అందరూ కష్టపడి పని చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. చిన్నారుల వైద్య సంరక్షణ చర్యలకు సంబంధించి సౌకర్యాలు.. సదుపాయాలు ఇతరత్రా అధునాతన పరికరాలు అందించే విషయంలో ఏ సహాయం కావాలన్నా అందిస్తామని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. మొత్తానికి చిన్నారుల సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యంగా వైద్య బృందం కృషి చేయాలని సూచించారు. చిన్నారులు వారి తల్లిదండ్రులతోనూ వైద్య సేవల విషయంలో కలెక్టర్ వివరాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డిఎం అండ్ హెచ్ ఓ వెంకటరమణ, డిసిహెచ్ఎస్ కృష్ణ ప్రసాద్, ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి మెడికల్ సూపరిండెంట్ జి వీరారెడ్డి, ఏఆర్ఎంఓ నవీనా, సుధాకర్, డిప్యూటీ సూపరిండెంట్ ఉదయ్ ఆదిత్య, గైనకాలజిస్ట్లు పిల్లల వైద్య నిపుణులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Next Story