స్వచ్ఛ రామగుండంగా తీర్చిదిద్దుతా : మేయర్ మహంకాళి స్వామి

by Nallavelli.Anjaneyulu |

స్వచ్ఛ రామగుండంగా తీర్చిదిద్దేందుకు పారిశుధ్య సిబ్బంది మరింత మెరుగ్గా పని చేయాలని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి అన్నారు.

స్వచ్ఛ రామగుండంగా తీర్చిదిద్దుతా : మేయర్ మహంకాళి స్వామి
X

దిశ, గోదావరిఖని : స్వచ్ఛ రామగుండంగా తీర్చిదిద్దేoదుకు పారిశుధ్య సిబ్బంది మరింత మెరుగ్గా పని చేయాలని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి అన్నారు. శుక్రవారం రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో పారిశుధ్య విభాగం సిబ్బందితో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ శానిటేషన్ సిబ్బంది, వాహనాలు సక్రమంగా సద్వినియోగం చేసుకొని గృహస్థులు చెత్త బయట వేయకముందే సేకరించాలని అన్నారు. రోజు విడిచి రోజు తప్పని సరిగా ప్రతి ఇంటి నుండి చెత్త సేకరించాలని తెలిపారు. మురుగు నీటి కాలువలను నిర్ణీత కాల వ్యవధి లో తప్పకుండా శుభ్రం చేయాలని అన్నారు. ఈ సమావేశంలో నగర పాలక సంస్థ డిప్యూటీ కమీషనర్ నాయిని వెంకట స్వామి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పి.వి.రామన్, డీఈ శాంతి స్వరూప్, శానిటరీ ఇన్ స్పెక్ట‌ర్లు, నాగ భూషణం, సంపత్, సానిటరీ జవాన్లు పాల్గొన్నారు.

Next Story