అగ్నికి ఆహుతైన మొక్కజొన్న పంట

by Ratna Kumari |

ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికి అందేలోపే అగ్నికి ఆహుతై రైతన్న కంట కన్నీరు పెట్టించిన ఘటన జమ్మికుంట మండలంలోని వావిలాల గ్రామంలో చోటు చేసుకుంది.

అగ్నికి ఆహుతైన మొక్కజొన్న పంట
X

దిశ, జమ్మికుంట : ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికి అందేలోపే అగ్నికి ఆహుతై రైతన్న కంట కన్నీరు పెట్టించిన ఘటన జమ్మికుంట మండలంలోని వావిలాల గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. 20 మంది రైతులకు సంబంధించిన 19 ఎకరాల మొక్కజొన్న పంట పూర్తయి కోతకు వచ్చిన సమయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో రైతన్న ను దుఃఖానికి గురిచేసింది. దాదాపు ఏడు ఎకరాల వరి పంట అగ్ని కి కాళీ బూడిదయింది.

Next Story