మహాలక్ష్మి పథకంలో మహిళలకు రూ. 2,500 ఇవ్వాలి

by Ratna Kumari |

కాంగ్రెస్ పార్టీ ఎన్నిక‌ల‌కు ముందు ఆరు గ్యారెంటీలు నాలుగు వంద‌ల ఇర‌వై హామీలు ఇవ్వ‌డంతో తెలంగాణ ప్రజలు నమ్మి ఓట్లు వేస్తే సీఎం మాత్రం మహిళల ఇచ్చిన హామీలు మాత్రం అమలు చేయడం లేదు.

మహాలక్ష్మి పథకంలో  మహిళలకు రూ. 2,500 ఇవ్వాలి
X

దిశ, కరీంనగర్ కలెక్టరేట్ : కాంగ్రెస్ పార్టీ ఎన్నిక‌ల‌కు ముందు ఆరు గ్యారెంటీలు నాలుగు వంద‌ల ఇర‌వై హామీలు ఇవ్వ‌డంతో తెలంగాణ ప్రజలు నమ్మి ఓట్లు వేస్తే సీఎం మాత్రం మహిళల ఇచ్చిన హామీలు మాత్రం అమలు చేయడం లేదు. ఇవాళ‌ కరీంనగర్ లో తెలంగాణ జాగృతి ఆద్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు దర్నా చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ మాట్లాడుతూ తెలంగాణ సీఎంగా మీరు పదవీ బాధ్యతలు స్వీకరించిన వంద రోజులలో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి ఇప్పటి వరకు మహిళలకు ఇచ్చిన హామీలు అమలు చెయ్యడంలో పూర్తిగా వైఫల్యం చెందారు. ఇవాళ మహిళలు సీఎం మీద దర్నాలు చేసి వారికి ఇచ్చిన హామీలు గుర్తు చేస్తున్నారు. క‌నీసం ఈ బడ్జెట్ లోనైనా మనకు సంబంధించిన హామీల అమలు కోసం ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటుదో అని మహిళల ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. రేవంత్ రెడ్డి సీఎం కాకముందు డిల్లీ నాయకులను తీసుకువచ్చి మహిళలకు మహాలక్ష్మి పథకం కింద రూ.2,500 నెలవారీ ఆర్థిక సహాయం ఇస్తాం, కళ్యాణలక్ష్మి క్రింద తులం బంగారం, చదువుకునే అమ్మాయకు స్కూటిలు ఇస్తామ‌న్నారు. నాలుగు వేల పింఛ‌న్ మంజూరు చేస్తాం మహిళల రక్షణ కోసం ప్రత్యేకమైన చట్టాలను తీసుకువస్తాం అని.. చాలా ర‌కాల హామీలు ఇచ్చి అధికారంలోకి వ‌చ్చారు.


సీఎం ప‌ద‌వీ చెప్పట్టిన రేవంత్ రెడ్డి ఇరవై ఆరు నెలలు అయినప్పటికీ మహిళలకు ఇచ్చిన హామీల ఊసేలేదు అందుకే ఇవాళ‌ కరీంనగర్ తెలంగాణ జాగృతి ఆద్వర్యంలో మహిళల ఇచ్చిన ఎన్నికల హామీలు అమలు చేయాల‌ని కలెక్టర్ కార్యాలయం ముట్టడి చేసి వినతిపత్రం అంద‌జేసిన‌ట్టు తెలిపారు. ప్రభుత్వం అతి త్వరగా ఇచ్చిన హామిలను నెరవేర్చకపోతే సీఎం ఇల్లు ముట్టడి చేస్తామ‌ని.. జాగృతి జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ అన్నారు. ఈ కార్యక్రమంలో జాగృతి మహిళ విభాగం జిల్లా అధ్యక్షురాలు అంకం శివరాణి, జిల్లా ప్రధాన కార్యదర్శి మ్యాకల తిరుపతి, అదివాసి విభాగం జిల్లా అధ్యక్షుడు కుతాడి శ్రీనివాస్, జిల్లా సినియార్ నాయకులు వరాల శ్రీనివాస్, రంగరవేణి లక్ష్మణ్, ఊలేందుల నరేష్, చంటి శ్రీనివాస్, మహిళ విభాగం నాయకురాలు సంగీత రెడ్డి, జంగ అపర్ణ, MD సల్మ, ఐలా ప్రసన్న, సంతోషిణి, చంటి శ్రీనివాస్, ఉప్పరి సంగీత, బసవేణి రాజేందర్, శీలం శ్రీనివాస్, హరిష్ శేఖర్, గుండేటి తిరుపతి, గాలిపల్లి రత్నాకర్ చారి, బండ అశోక్, సంతోష్ యాదవ్, బణాల కుమారస్వామి, సబ్బని భాస్కర్ ఉన్నారు

Next Story