ఎంఏ తెలుగులో బంగారు పతకం అందుకున్న మాధురి

by velandi.Saikiran |

ఎంఏ తెలుగులో బంగారు పథకాన్ని వాసం మాధురి తెలంగాణ గవర్నర్ జీష్ణు దేవ్ వర్మ చేతుల మీదుగా శుక్రవారం అందుకున్నారు.

ఎంఏ తెలుగులో బంగారు పతకం అందుకున్న మాధురి
X

దిశ, మల్లాపూర్: ఎంఏ తెలుగులో బంగారు పథకాన్ని వాసం మాధురి తెలంగాణ గవర్నర్ జీష్ణు దేవ్ వర్మ చేతుల మీదుగా శుక్రవారం అందుకున్నారు. మల్లాపూర్ మండలం కొత్త ధాం రాజ్ పల్లి గ్రామానికి చెందిన వాసం రమేష్, మమత దంపతులకు కూతురు మాధురి, కుమారుడు మధుకర్ కలదు. అయితే మాధురి పీజీ ప్రభుత్వ కళాశాల కోరుట్లలో విద్యను అభ్యసించింది. ఈ సందర్భంగా వాసం మాధురి మాట్లాడుతూ బంగారు పథకం అందడం చాలా ఆనందంగా ఉందని, ఈ స్థాయిలో ఉండటానికి కారణం తన భర్త పోతు వినోద్ కుమార్ అని తెలిపారు. బంగారు పత‌కం రావడంతో తోటి విద్యార్థులు, బంధువులు, గ్రామస్తులు అభినందనలు తెలిపారు.

Next Story