మామిడిప‌ల్లిలో చిన్నారుల‌పై పిచ్చికుక్క‌ల దాడి

by Ratna Kumari |

వారంలో రోజు వ్యవధిలోనే మరోసారి విధి కుక్కల స్వైర విహారం చేశాయి. దీంతో చిన్నారుల‌కు తీవ్ర‌గాయాల‌య్యాయి.

మామిడిప‌ల్లిలో చిన్నారుల‌పై పిచ్చికుక్క‌ల దాడి
X

దిశ, కోనరావుపేట : వారంలో రోజు వ్యవధిలోనే మరోసారి విధి కుక్కల స్వైర విహారం చేశాయి. దీంతో చిన్నారుల‌కు తీవ్ర‌గాయాల‌య్యాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా,కోనరావుపేట మండలంలోని మామిడిపల్లి గ్రామంలో గురువారం సాయంత్రం వీధికుక్కల దాడిలో గ్రామానికి చెందిన చింతం రాజేష్ (10), చింతం అజయ్ (06) అనే ఇద్దరు చిన్నారులపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. గత వారంలో రాబీస్ వ్యాధితో బాలుడు చనిపోయిన ఘటన మరువకముందే మరోసారి ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. గ్రామంలో వీధికుక్కల సమస్య రోజురోజుకూ పెరుగుతున్నాయి. చిన్నారులపై కుక్కలు వరుస దాడి చేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గ్రామ అధికారులు, సంబంధిత పంచాయతీ అధికారులు ఇప్పటికైనా స్పందించాలని, వీధికుక్కల నియంత్రణకు తక్షణమే చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. మానవ ప్రాణాలకంటే జంతువుల ప్రాణాలు ఎక్కువ కాదు. విధి కుక్కలను చంపేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం కోర్టు కూడా ఆదేశాలు జారీచేసిన విషయం తెలిసిందే. చిన్న పిల్లలు బయటకు రావాలంటేనే తల్లిదండ్రులు వణికిపోతున్న పరిస్థితి నెలకొందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఇకనైనా మేల్కొని శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.

Next Story