చంద్రగ్రహణం ఎఫెక్ట్.. రాములోరి ఆలయం మూసివేత

by Jakkula.Mamatha |

శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయాన్ని ఈనెల 3న చంద్రగ్రహణం సందర్భంగా ఉదయం 7 గంటలకు ఆలయాన్ని మూసివేసి ఆలయ కార్యనిర్వాహణాధికారి ప్రకటన ద్వారా తెలియజేశారు.

చంద్రగ్రహణం ఎఫెక్ట్.. రాములోరి ఆలయం మూసివేత
X

దిశ, జమ్మికుంట: అపర భద్రాద్రిగా పేరుగాంచిన ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయాన్ని ఈనెల 3న చంద్రగ్రహణం సందర్భంగా ఉదయం 7 గంటలకు ఆలయాన్ని మూసివేసి.. మరుసటి రోజు సంప్రోక్షణ అనంతరం ఉదయం 10 గంటలకు తెరవబడునని ఆలయ కార్యనిర్వాహణాధికారి కందుల సుధాకర్ ప్రకటన ద్వారా తెలియజేశారు. అలాగే, ఈనెల 4న హోలీ వసంతోత్సవం సందర్భంగా స్వామి వారు గ్రామ దేవాలయం నుంచి ఉదయం 9 గంటలకు ఊరేగింపుగా బయలుదేరి ప్రధాన దేవాలయాలకు ప్రవేశించిన అనంతరం స్వామి వారికి నిత్య నిధి కార్యక్రమంతో పాటు వసంతోత్సవం, డోలోత్సవం జరుపబడునని తెలిపారు. కావున భక్తులు గమనించగలరని కోరుతున్నారు.

Next Story