- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రతి అడుగూ ప్రమాదమే.. లో లెవెల్ బ్రిడ్జి భయానక గతి
శంకరపట్నం మండలంలోని మెట్టుపల్లి – లింగాపూర్ గ్రామాల మధ్యనున్న పురాతన కాలం నాటి లో లెవెల్ వంతెన ఇప్పుడు పూర్తిగా నెరుసుకుపోయి, గ్రామాల ప్రజలకు రాకపోకల్లో పెద్ద అడ్డంకిగా మారింది.

దిశ, శంకరపట్నం: పురాతన లో లెవెల్ వంతెనతో ఇబ్బంది పడుతున్నట్లు ఆముదాలపల్లి ,మెట్టుపల్లి గ్రామస్తులు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. శంకరపట్నం మండలంలోని మెట్ పల్లి ,లింగాపూర్ గ్రామాల మధ్య పురాతన కాలం నాటి లో లెవెల్ వంతెన వల్ల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఎదురవుతున్నట్లు తెలిపారు. వర్షాకాలం వచ్చిందంటే వంతెన నుండి వెళ్లడం సాహసమేనని .పూర్తిగా వంతెన పాడైపోయిందని రాత్రివేళ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి అన్నారు.
నిత్యం వందలాది వ్యవసాయ, వాణిజ్య వాహనాలు ఈ వంతెన పై నుండి సింగపూర్ అడ్డరోడ్డుకు చేరుకుంటాయి. గత కొన్ని సంవత్సరాలుగా పాలకులకు అధికారులకు మొరపెట్టుకున్న ఫలితం లేదన్నారు. హై లెవెల్ బ్రిడ్జి నిర్మించకున్న పర్వాలేదు కనీసం లో లెవెల్ వంతెన నైనా బాగు చేయండి అని అధికారులను వేడుకున్న కనికరించడం లేదని ఆయా గ్రామస్తులు వాపోతున్నారు. మరమ్మత్తులు చేసి రాకపోకలకు ఇబ్బంది కలగకుండా చూడాలని అధికారులను ప్రజాప్రతినిధులను ఆయా గ్రామాల ప్రజలు వేడుకుంటున్నారు.






