- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రేమ విఫలం.. మనస్థాపంతో యువకుడు ఆత్మహత్య
ప్రేమించిన అమ్మాయి తన ప్రేమను నిరాకరించిందని.. మనస్థాపానికి గురై యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం గోదావరిఖని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సంతోష్ నగర్ లో చోటు చేసుకుంది.

దిశ, యైటింక్లయిన్ కాలనీ : ప్రేమించిన అమ్మాయి తన ప్రేమను నిరాకరించిందని.. మనస్థాపానికి గురై యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం గోదావరిఖని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సంతోష్ నగర్ లో చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నిమ్మతి అజయ్(20) అనే యువకుడు సంతోష్ నగర్ లో నివాసముంటూ డెకరేషన్ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తాడు. ఇతని తో పాటు తల్లి, చెల్లితో కలిసి జీవనం సాగిస్తున్నాడు. అయితే సబితం గ్రామానికి చెందిన యువతీని దాదాపు 3సంవత్సరాల నుంచి ప్రేమిస్తున్నాడు. ఆ యువతీ మాత్రం ఇతని ప్రేమను అంగీకరించలేదు. ఈ క్రమంలో 2022, 2025 సంవత్సరంలో ప్రేమలో విఫలమాయ్యానని ఆవేదనతో రెండుసార్లు క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడని తెలిపారు. రెండు రోజుల క్రితం తన సోదరి వివాహం కోసం సంబంధం మాట్లాడటానికి కుటుంబ సభ్యులతో కలిసి సుల్తానాబాద్ మండలం కదంబాపూర్ గ్రామానికి వెళ్లారు.
తనకు డెకరేషన్ పని ఉందని శనివారం మధ్యాహ్నం ఊరు నుంచి సంతోష్ నగర్ కి వచ్చాడు. సమీప బంధువులు భోజనం పెట్టగా.. తిని తన రూమ్ కి వెళ్ళిపోయాడు. ప్రేమ విఫలమైందని, ప్రియురాలు ప్రేమ నిరాకరించిందని, మానసిక వేదనతో కుంగిపోతున్న అజయ్ తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం ఉదయం టీ కోసం తలుపుతట్టగా.. ఎంతకీ స్పందించకపోవడంతో కిటికీలో నుండి చూసేసరికి పై కప్పుకుని ఉన్న ఇనుప రాడ్ కు చీరతో ఉరిసుకొని విగత జీవిగా కనిపించాడు. సమాచారం అందుకున్న టూ టౌన్ ఎస్సై అహ్మదుల్లా సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. మృత దేహాన్ని పంచనామా నిమిత్తం గోదావరిఖని గవర్నమెంట్ ఆసుపత్రికి తరలించారు. మృతుని తల్లి స్వరూప ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.






