- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య తుది విడత పల్లె పోరు
తుది విడత పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఓటింగ్

నేడే తుది విడత పల్లె పోరు
పోలింగ్ కేంద్రాలకు చేరిన సామగ్రి
పోలీసుల కట్టుదిట్టమైన
భద్రతా ఏర్పాట్లు
అమలులో నిషేదాజ్ఞలు
డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను
సందర్శించిన కలెక్టర్లు
దిశ బ్యూరో, కరీంనగర్ : తుది విడత పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఓటింగ్ జరగనుండగా మధ్యాహ్నం 2:30 గంటలకు లెక్కింపు ప్రారంభం కానుంది. ఓటింగ్ ప్రక్రియ లో ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు పగడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అదికారులు పగడ్బందీ ఏర్పాట్లు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఓటింగ్ పూర్తయి ఫలితాలు వెలువడే వరకు పోలీసులు నిషేద ఆజ్ఞలు అమలులో ఉంటాయని ఊరేంగిపులు విజయోత్సవ ర్యాలీలు చేయరాదని ఏవరైనా అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ముందస్తు హెచ్చరికలు జారీచేసారు
పోలీంగ్ కేంద్రాలకు చేరిన సామగ్రి
తుది విడత ఎన్నికలు పగడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఎన్నికల సామగ్రిని సోమవారం సాయంత్రానికి పోలింగ్ సెంటర్ లకు తరలించిన అధికారులు పోలింగ్ కు ఎలాంటి అవాంతరాలు జరగకుండా చర్యలు చేపట్టారు. ఎన్నికల సమయంలో ఎలా వ్య వహరించాలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎన్నికల సిబ్బందికి ప్రత్యేక సూచనలు చేశారు. ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేలా ముందస్తు చర్యలు చేపట్టారు. ఎన్నికల వేళ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టు దిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.






