- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాయపట్నంలో చిరుత కలకలం
దిశ, వెల్గటూర్ : జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం రాయపట్నం వెల్గటూర్ మండలం స్థంబంపల్లి గ్రామాల మధ్యలో చిరుత సంచారం మంగళవారం

దిశ, వెల్గటూర్ : జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం రాయపట్నం వెల్గటూర్ మండలం స్థంబంపల్లి గ్రామాల మధ్యలో చిరుత సంచారం మంగళవారం కలకలం సృష్టిస్తోంది. గోదావరి తీర గ్రామాలైన రాయపట్నం స్థంబంపల్లి కి పొరుగున ఉన్న అదిలాబాద్ జిల్లా నుంచి గోదావరి దాటి ఈవలి తీరానికి చిరుత చేరిందనే పూకార్ ఈ ప్రాంతంలో షికారు చేస్తోంది. అయితే రాష్ట్ర రహదారిపై కొత్త పల్లి రాయపట్నం శివారులో స్టేట్ హై వే పై మోటర్ సైకిల్ పై లక్షెట్టిపేట వైపు వెళ్తున్న రంజిత్ కుమార్ అనే వ్యక్తి స్టేట్ హైవే పక్కనున్న పెట్రోల్ అంకు సమీపంలో చిరుతను గమనించినట్లు సమాచారం. చిరుత కనిపించిందని వార్త రోజంతా ఈ ప్రాంతంలో సంచలనం రేపింది. దీంతో వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు కూలీలు పనులకు వెళ్లకుండా భయంతో ఇంటికే పరిమితమయ్యారు. విషయం తెలుసుకున్న ఫారెస్ట్ అధికారి వంగ శ్రీనాథ్ తన సిబ్బందితో కలిసి చిరుత సంచరించిన ప్రదేశానికి చేరుకొని దాని జాడ తెలుసుకోవడానికీ ఆ ప్రదేశంలో పాద ముద్రలను పరిశీలించారు. చిరుతపులికి సంబంధించిన ఎటువంటి ఆనవాళ్లు లభించలేదని ఫారెస్ట్ అధికారులు వెల్లడించారు. నిజంగానే చిరుత స్ధంబంపల్లి, రాయపట్నం అటవీ ప్రాంతంలో ప్రవేశించిందా, ఒకవేళ అది వచ్చింది నిజమే అయితే అటవీ అధికారుల దృష్టికి ఎందుకు ఆనవాళ్లు లభించ లేదు. అధికారుల దృష్టికి రాకుండా అడవి లోపలికి వెళ్ళిపోయిందా, అనేది అంతు చిక్కకుండా ఉంది.
ధర్మపురిలో సంచరించింది హైనా నా..?
గతంలో ధర్మపురి శివారు గ్రామమైన రామయ్యపల్లి లో చిరుత పులి సంచారం అని ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఆ తర్వాత అటవీ అధికారులు ఎంటరై క్షుణ్ణంగా పరిశీలించగా అక్కడ సంచరించింది. చిరుత కాదు.. హైన అని వారు సేకరించిన పాదముద్రలను గుర్తించి అది కారులు తేల్చి చెప్పారు. అంతకంటే ముందు వెల్గటూర్ మండలం పడకల్ ప్రాంతంలో కూడా పులి సంచారం అనే వార్త ప్రజలను భయాం దోళనకు గురి చేసింది. అది కూడా హైనా అని అటవీ అధికారులు గుర్తించారు. మరి ఈ ప్రయాణికుడు చూసింది, చిరుత, హైనా, మరి ఇంకేదైనా క్రూర జంతువా అని అటవీ అధికారులు తేల్చాల్సి ఉంది. రాయ పట్నం లో చిరుత సంచారం ఘటన పట్ల లోతుగా అన్వేషణ చేసి అసలు విషయాన్ని రాబట్టి ప్రజల్లో నెలకొన్న భయాందోళనకు చెక్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక వేల అక్కడ కనిపించిన జంతువు నిజంగా చిరుతే అయితే వ్యవసాయ పనులకు అటవీ తీర ప్రదేశాలకు వెళ్లే రైతులు కూలీల ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉంది.






