ఎర్రజెండా వీడి గులాబీ గూటికి..!

by Ratna Kumari |

గత కొంతకాలంగా సీపీఎం పార్టీలో పని చేసిన వీర్నపల్లి సర్పంచ్ మల్లారపు జ్యోత్స్న అరుణ్ కుమార్ దంపతులు, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు జాలపల్లి మనోజ్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు.

ఎర్రజెండా వీడి గులాబీ గూటికి..!
X

దిశ, ఎల్లారెడ్డి పేట : గత కొంతకాలంగా సీపీఎం పార్టీలో పని చేసిన వీర్నపల్లి సర్పంచ్ మల్లారపు జ్యోత్స్న అరుణ్ కుమార్ దంపతులు, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు జాలపల్లి మనోజ్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మంగళవారం సిరిసిల్ల తెలంగాణ భవన్ లో నిర్వహించిన సమావేశంలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గులాబీ కండువా కప్పారు. వారితో పాటు ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు గుండెల్లి కళ్యాణ్ కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, జ‌డ్పీ మాజీ అధ్యక్షురాలు తుల ఉమ, న్యాలకొండ అరుణ, సెస్ డైరెక్టర్ మాడుగుల మల్లేశం, పార్టీ మండల అధ్యక్షుడు గుజ్జుల రాజిరెడ్డి, సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు సామల దేవరాజు, మాజీ జడ్పీటీసీ కళావతి సురేష్ నాయక్, ఉప సర్పంచ్ ల ఫోరం మాజీ మండల అధ్యక్షుడు బోయిని రవి పాల్గొన్నారు.

Next Story