జగిత్యాల మున్సిపాలిటీలో కుంటుపడిన పాలన.. కమిషనర్, చైర్మన్ ఇద్దరూ వారే..

by Mallepaka Hamsa |   (  Updated:2023-05-20 04:00:43  IST  )

మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం మున్సిపల్ యాక్ట్‌కు సవరణ చేసి ఆన్ లైన్ విధానాన్ని ప్రవేశపెట్టింది.

జగిత్యాల మున్సిపాలిటీలో కుంటుపడిన పాలన.. కమిషనర్, చైర్మన్ ఇద్దరూ వారే..
X

జగిత్యాల మున్సిపాలిటీలో పాలన గాడి తప్పుతోంది. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం మున్సిపల్ యాక్ట్‌కు సవరణ చేసి ఆన్ లైన్ విధానాన్ని ప్రవేశపెట్టింది. కానీ జగిత్యాల మున్సిపాలిటీలో మాత్రం అందుకు అనుగుణంగా పాలన కుంటుపడిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆన్‌లైన్ విధానంలో ఉన్న లొసుగులను ఆధారంగా చేసుకున్న కొంతమంది ఆఫీసర్లతోపాటు మరికొందరు పాలకవర్గంలోని లీడర్లు అక్రమ దందాలు, సంపాదన కోసం పట్టణవాసులను పట్టిపీడిస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. నాటకీయ పరిణామాల మధ్య భోగ శ్రావణి మున్సిపల్ చైర్ పర్సన్ పదవికి రాజీనామా చేసిన అనంతరం వైస్ చైర్మన్‌గా ఉన్న గోలి శ్రీనివాస్‌కు ఇన్చార్జ్ చైర్మన్‌గా బాధ్యతలు అప్పగించారు. ఇక అంతకుముందే సెలవుల్లో వెళ్లిన కమిషనర్ స్థానంలో డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్న బోనగిరి నరేష్‌కు కమిషనర్‌గా అదనపు బాధ్యతలను అప్పగించారు. పట్టణ అభివృద్ధిలో కీ రోల్ పోషించే కమిషనర్, చైర్మన్ ఇద్దరు ఇన్చార్జిలే కావడంతో కొంతమంది కిందిస్థాయి సిబ్బంది ఆడిందే ఆట.. పాడింది పాట అన్న తీరుగా మున్సిపల్ పరిస్థితి తయారైందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

దిశ, జగిత్యాల ప్రతినిధి: మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం మున్సిపల్ యాక్ట్‌కు సవరణ చేసి ఆన్ లైన్ విధానాన్ని ప్రవేశపెట్టింది. కానీ జగిత్యాల మున్సిపాలిటీలో మాత్రం అందుకు అనుగుణంగా పాలన సాగడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆన్‌లైన్ విధానంలో ఉన్న లొసుగులను ఆధారంగా చేసుకున్న కొంతమంది ఆఫీసర్లతోపాటు మరికొందరు పాలకవర్గంలోని లీడర్లు అక్రమ దందాలు, సంపాదన కోసం పట్టణవాసులను పట్టిపీడిస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

నాటకీయ పరిణామాల మధ్య భోగ శ్రావణి మున్సిపల్ చైర్ పర్సన్ పదవికి రాజీనామా చేసిన అనంతరం వైస్ చైర్మన్‌గా ఉన్న గోలి శ్రీనివాస్‌కు ఇన్చార్జ్ చైర్మన్‌గా బాధ్యతలు అప్పగించారు. ఇక అంతకుముందే సెలవుల్లో వెళ్లిన కమిషనర్ స్థానంలో డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్న బోనగిరి నరేష్‌కు కమిషనర్‌గా అదనపు బాధ్యతలను అప్పగించారు. పట్టణ అభివృద్ధిలో కీ రోల్ పోషించే కమిషనర్, చైర్మన్ ఇద్దరు కూడా ఇన్చార్జిలే కావడంతో కొంతమంది కిందిస్థాయి సిబ్బంది ఆడిందే ఆట పాడింది పాట అన్న తీరుగా మున్సిపల్‌లో పరిస్థితి తయారైందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

గాడిన పడేనా..?

పట్టణాభివృద్ధిలో కీలకంగా వ్యవహరించే కమిషనర్, చైర్మన్ ఇద్దరు కూడా ఇన్చార్జిలే కావడంతో పాలన కుంటుపడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్‌గా ఉన్న బోనగిరి నరేష్ అంతర్గత విభాగాలైన చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్, ఐసీడీఎస్, డిసేబుల్, సీనియర్ సిటిజన్, చైల్డ్ హెల్ప్ లైన్, సఖి వన్ స్టాప్ సెంటర్లను పర్యవేక్షించి కో ఆర్డినేట్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికి తోడు జిల్లా యూత్ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్‌గా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయన సొంత డిపార్ట్‌మెంట్లోనే తీరిక లేకుండా పనిచేస్తుంటే అత్యంత కీలకమైన జగిత్యాల మున్సిపల్ ఇంచార్జ్ కమిషనర్‌గా బాధ్యతలను అప్పగించారు.

సొంత శాఖలో బిజీగా ఉండే ఇంచార్జి కమిషనర్ మున్సిపల్‌లో సమయం కేటాయించలేకపోతున్నారు. దీంతో ఆఫీస్ సమయం అయిపోయిన తర్వాత ఇంచార్జి కమిషనర్ రావడంతో పూర్తి స్థాయిలో వివిధ సెక్షన్లకు చెందిన ఆఫీసర్లకు, పట్టణవాసులకు అందుబాటులో ఉండకపోవడంతో పదుల సంఖ్యలో ఫైల్స్ పెండింగ్ ఉంటున్నాయి. ఫైల్స్ విషయంలో తీవ్ర జాప్యం జరగడమే కాక మున్సిపల్ ఆఫీస్ చుట్టూ తిరగాల్సి వస్తుందని పట్టణవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా కొత్త చైర్ పర్సన్ నియామకం చేపట్టకపోవడంతో పాలకవర్గంలో భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దానికి తోడు ఇన్చార్జి చైర్మన్‌కు పాలకవర్గం పూర్తిస్థాయిలో సహకరించడం లేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మున్సిపల్ పాలన గాడిన పడాలంటే పూర్తి స్థాయి కమిషనర్‌ను నియమించి చైర్ పర్సన్ ఎన్నిక చేపట్టాలని పుర ప్రజలు కోరుతున్నారు.

చైర్ పర్సన్ ఎంపికలో జాప్యం ఎందుకు..?

భోగ శ్రావణి చైర్ పర్సన్ పదవికి రాజీనామా చేసి మూడున్నర నెలలు గడుస్తున్నా కొత్త చైర్ పర్సన్ నియామక ప్రక్రియలో ముందడుగు పడడం లేదు. శ్రావణి వార్డ్ కౌన్సిలర్ పదవికి సైతం రాజీనామా చేసినప్పటికీ ఇంతవరకు నోటిఫికేషన్ జారీ చేయలేదు. చైర్ పర్సన్ రేసులో ఉన్న ఆశావాహుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో కొత్త చైర్ పర్సన్ నియమిస్తే మిగిలిన వారితో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందనే జాప్యం చేస్తున్నట్లుగా అధికార పార్టీలోని ఒక వర్గం చెబుతోంది.

అందులో భాగంగానే ప్రస్తుతం ఉన్న ఇన్చార్జి చైర్మన్‌నే కొంతకాలం కొనసాగించి అంతా సర్దుకున్నాక చైర్ పర్సన్ నియామకం చేపడతారని వినికిడి. అయితే అదే పార్టీలోని మరో వర్గంలో మాత్రం కొత్త చైర్ పర్సన్ నియామకం చేపట్టాలని అధిష్టానం నుంచి ఆదేశాలు వచ్చాయని, మరో రెండు వారాల్లో పూర్తి స్థాయి చైర్ పర్సన్‌ను నియమిస్తారనే చర్చ నడుస్తోంది. ఏది ఎలా ఉన్నా పూర్తిస్థాయి చైర్ పర్సన్‌తోపాటు పూర్తి స్థాయి కమిషనర్ నియమిస్తే ఎటువంటి ఇబ్బందులు తలెత్తవని పట్టణవాసులు భావిస్తున్నారు.

Next Story