- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చేతివృత్తులపై జీఎస్టీని ఉపసంహరించాలి
by velandi.Saikiran |
చేనేత చేతివృత్తులపై జిఎస్టిని పూర్తిగా ఉపసంహరించుకోవాలని ఎమ్మెల్సీ ఎల్ రమణ లేఖ రాశారు

X
దిశ, జగిత్యాల టౌన్: చేనేత చేతివృత్తులపై జిఎస్టిని పూర్తిగా ఉపసంహరించుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్, సీఎం రేవంత్ రెడ్డి లకు ఎమ్మెల్సీ ఎల్ రమణ లేఖ రాశారు. చేనేత, చేతివృత్తుల రంగలపై కేంద్ర ప్రభుత్వం విధించిన జీఎస్టీ వలన లక్షలాదిమంది కళాకారులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కళాకారుల గొప్పదనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ప్రధాని వారిపై పనుల బారాన్ని మోపడం అన్యాయమన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే చేనేత పై ఉన్న 5శాతం జీఎస్టీ బారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఇచ్చిన హామీని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
Next Story






