పెద్ద వెంకటరెడ్డి కథ చెప్పిన కేటీఆర్

by Disha Web Desk 23 |   (  Updated:2023-10-16 10:05:01  IST  )

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ సెక్రటరీ జనరల్ కేశవరావుతో కలిసి

పెద్ద వెంకటరెడ్డి కథ చెప్పిన కేటీఆర్
X

దిశ, సిరిసిల్ల : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ సెక్రటరీ జనరల్ కేశవరావుతో కలిసి ఆదివారం సిరిసిల్ల పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ పెద్ద వెంకటరెడ్డి కథ చెప్పారు. ఒక ఇంట్లో ముగ్గురు పెద్ద వెంకటరెడ్డి, చిన్న వెంకటరెడ్డి, నడిపి వెంకటరెడ్డి అన్నదమ్ములు ఉంటారని, ముగ్గురు ఒకరికొకరు పడక తలో పార్టీలో చేరుతారన్నారు. పెద్ద వెంకటరెడ్డి బీఆర్ఎస్ పార్టీలోకి రావాలని ఉన్న మన పార్టీలో ఉన్న చిన్న వెంకటరెడ్డి రానివ్వని పరిస్థితి పార్టీలో నెలకొందన్నారు. ఇలాంటి ఈగొలన్ని పక్కన పెట్టి ఉన్న ముగ్గురు వెంకటరెడ్డి లలో పార్టీలోకి తీసుకువచ్చి మన అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించుకోవాలన్నారు. ఇది విన్న నాయకులు, కార్యకర్తలు గొల్లున నవ్వారు. పార్టీలోకి ఎవరు వచ్చినా స్వాగతించాలని కేటీఆర్ బీఆర్ఎస్ నేతలకు సూచించారు.

Next Story