గల్ఫ్ బాధితుడికి కేటీఆర్ భరోసా

by Bhanu |   (  Updated:2025-05-11 13:42:16  IST  )

బతుకుదెరువు కోసం పరాయి దేశం వెళ్లిన బాధితుడికి టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ భరోసాగా నిలిచారు.

గల్ఫ్ బాధితుడికి కేటీఆర్ భరోసా
X

దిశ, తంగళ్ళపల్లి: బతుకుదెరువు కోసం పరాయి దేశం వెళ్లిన బాధితుడికి టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ భరోసాగా నిలిచారు. ఆదివారం తంగళ్ళపల్లి మండలం మండేపల్లి గ్రామానికి చెందిన మంద మహేష్ కుటుంబాన్ని మాజీ మంత్రి కేటీఆర్ పరామర్శించి మహేష్ తో వీడియో కాల్ లో మాట్లాడారు. వివరాల్లోకి వెళితే.. మహేష్ ఇటీవల సౌదీ అరేబియాకు బతుకుదెరువు కోసం వెళ్లి రోజు నిత్యం తాను చేసుకుంటున్న పనులలో భాగంగా డ్యూటీకి వెళ్తున్న సమయంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఇదే తన తోటి ప్రయాణికులు 8 మంది మృతి చెందడంతోపాటు మహేష్ కు తీవ్ర గాయాలయ్యాయి.


బాధితుడు తాను గతంలో టిఆర్ఎస్ క్రియాశీల కార్యకర్తగా పార్టీ కోసం పనులు నిర్వహించానని, తనను కెసిఆర్, కేటీఆర్ గుర్తించి తన ఆరోగ్యం సౌకర్యార్థం ఆస్పత్రి ట్రీట్మెంట్ కి అయ్యే వైద్య సహాయం అందించాలని, తనని ఇండియాకు వచ్చేలా ఏర్పాటు చేసి వైద్య సదుపాయం అందించాలని సోషల్ మీడియా వేదికగా కోరారు. దీంతో స్పందించిన కేటీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా మహేష్ కుటుంబాన్ని పరామర్శించి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. మహేష్ కుటుంబ సభ్యులు ఎలాంటి ఆందోళన చెందవద్దని, అతనికి వైద్య సదుపాయంతో పాటు స్వదేశానికి రప్పించేలా చర్యలు తీసుకుంటానని కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించారు.



Next Story