- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేసీఆర్ పాలనలో అభివృద్ధి...రేవంత్ పాలనలో అధోగతి
రైతులకు ఇచ్చిన హామీలన్నీ ఎగనామం పెట్టి, వాళ్లను నడిరోడ్డుపై నిలబెట్టిన దుర్మార్గపు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని అ

దిశ, వీణవంక: రైతులకు ఇచ్చిన హామీలన్నీ ఎగనామం పెట్టి, వాళ్లను నడిరోడ్డుపై నిలబెట్టిన దుర్మార్గపు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆగ్రహించారు. కేసీఆర్ పాలనలో అభివృద్ధి...రేవంత్ పాలనలో అధోగతి అన్నారు. శనివారం వీణవంకలోని బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తలు సమావేశంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాట్లాడారు.
రైతులకు కనీసం యూరియా బస్తాలు అందించలేని దుర్మార్గపు సర్కార్ ఇది అంటూ ఫైర్ అయ్యారు. తెలంగాణ ప్రజలకు ఆరు గ్యారంటీలతో 420 మోసపు హామీలు ఇచ్చి 420 ప్రభుత్వంగా నిలిచిందని అన్నారు. ముఖ్యంగా రైతుల విషయంలో మరి దారుణంగా తయారైందని, 24 గంటల కరెంటు ఇవ్వడం లేదని మండిపడ్డారు. రెండు లక్షల రుణమాఫీ పూర్తి స్థాయిలో కాలేదని, రైతుబంధు, రైతు బీమా విషయంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందని అన్నారు. బోనస్ కూడా ఇప్పటివరకు రైతులకు అందించలేదని నిప్పులు చెరిగారు.
రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కష్టపడి పనిచేస్తే విజయం తధ్యమని జోష్ నింపారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు పరిపాటి రవీందర్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వాలా బాలకిషన్, సింగిల్ విండో చైర్మన్ మావురపు విజయభాస్కర్ రెడ్డి, ఎంపీపీ తిరుపతిరెడ్డి, వైస్ ఎంపీపీ లతా, శ్రీనివాస్ లతో పాటు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.






