- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రికార్డుల్లో లేని ‘కోటా పబ్లిక్ స్కూల్.. సోషల్ మీడియాలో వైరల్
కరీంనగర్ కోటా పబ్లిక్ స్కూల్ రికార్డులో లేదని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జిల్లా అధికారులు ఈ పేరుతో స్కూల్ లేదని తేల్చి చెప్పడం గమనార్హం.

దిశ, కరీంనగర్ బ్యూరో : కరీంనగర్ నగరంలోని “కోటా పబ్లిక్ స్కూల్” వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఓ సామాజిక కార్యకర్త సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలను అడగటంతో విద్యాశాఖ అధికారులు ఇచ్చిన సమాధానంతో పలు సందేహలు వ్యక్తమవుతున్నాయి. కోటా పబ్లిక్ స్కూల్ కి అసలు అనుమతి ఉందా..? లేదా అనే అనుమానాలు కలుగుతున్నాయి.
సమాచార హక్కు చట్టంతో వెలుగులోకి..
కోటా పబ్లిక్ స్కూల్ కు సంబంధించిన వివరాలను కోరుతూ ఓ సామాజిక కార్యకర్త ఆర్టీఐ కింద దరఖాస్తు చేశాడు. దీంతో జిల్లా విద్యాశాఖ కార్యాలయం నుంచి ఇచ్చిన సమాధానం ఇప్పుడు పలు అనుమానాలకు తావిస్తోంది. ఆర్టీఐ చట్టం 2005 కింద “కోటా పబ్లిక్ స్కూల్” అనుమతులు, నమోదు వివరాలు, విద్యాశాఖ గుర్తింపు వంటి అంశాలపై సమాచారం ఇవ్వాలని జిల్లా విద్యాశాఖ అధికారికి దరఖాస్తు చేయగా.. దీనిపై స్పందించిన జిల్లా విద్యాశాఖ కార్యాలయంలోని పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, తమ కార్యాలయ రికార్డుల్లో “కోటా పబ్లిక్ స్కూల్” అనే పేరుతో ఎటువంటి విద్యాసంస్థ నమోదు కాలేదని అధికారికంగా లేఖ ద్వారా స్పష్టం చేశారు. అధికారుల సమాధానంతో ఇప్పుడు కోటా పబ్లిక్ స్కూల్ విషయం వివాదస్పదం అవ్వడంతో పాటు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
కోటా పబ్లిక్ స్కూల్..? లేకా కేపీఎస్
కోటా పబ్లిక్ స్కూల్ పేరుతో బోర్డు పెడితే ఇబ్బందులు తలెత్తే అవకాశముందని భావించిన యాజమాన్యం కేపీఎస్ అనే సంక్షిప్త పేరుతో నడుపుతున్నారు అనే వాదన వినిపిస్తోంది. కేపీఎస్ అంటే “కోటా పబ్లిక్ స్కూల్” అనే అర్థం వచ్చేలా తెలివిగా బోర్డు పెట్టి కార్యకలాపాలు కొనసాగిస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. విద్యాశాఖ రికార్డుల్లో స్కూల్ పేరు లేకపోయినా, మరో పేరుతో విద్యాసంస్థ నడుస్తుందా? అనుమతులు లేకుండానే విద్యార్థులకు బోధన జరుగుతుందా? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
మామూళ్ల మత్తులో విద్యాశాఖ ?
ప్రైవేట్ విద్యా సంస్థల తీరు పై విద్యాశాఖ అధికారుల తీరు పై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా ప్రైవేట్ పాఠశాలలు వ్యవహరిస్తున్నా చూసి చూడనట్లుగా వ్యవహరించడం అందుకు బలం చేకూరుస్తోంది. కోటా పబ్లిక్ స్కూల్ యాజమాన్యం విద్యా శాఖ నిబంధనలను బహిరంగంగా ఉల్లంఘింస్తున్నప్పటికీ చూసి చూడనట్టుగా వ్యవహరించడం పై విద్యార్థి యువజన సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.






