- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొండగట్టులో హత్య కలకలం.. మెట్ల మార్గం పక్కన కందకంలో పూడ్చిన యువకుడి మృతదేహం
జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టులో ఓ యువకుడి హత్య కలకలం రేపింది.

దిశ, కొడిమ్యాల ( మల్యాల) : జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టులో ఓ యువకుడి హత్య కలకలం రేపింది. కొండగట్టు గుట్టపైకి వెళ్లే మెట్ల మార్గం పక్కన ఉన్న కందకంలో పూడ్చిపెట్టిన మృతదేహాన్ని పోలీసులు వెలికితీశారు.
స్థానిక సీఐ నీలం రవి తెలిపిన వివరాల ప్రకారం, మృతుడు ఉప్పు రమణ రెడ్డి (30) గా గుర్తించారు. ఆయన సోదరుడు ఉప్పు నిరంజన్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విచారణలో మెట్ల మార్గం పక్కనే రమణ రెడ్డి హత్యకు గురైనట్లు, అనంతరం మృతదేహాన్ని కందకంలో పూడ్చినట్లు ఆధారాలు లభించాయి.
ప్రాథమిక దర్యాప్తులో ఈ హత్యలో మొత్తం ఎనిమిది మంది ఉన్నట్లు గుర్తించామని సీఐ రవి తెలిపారు. మృతదేహాన్ని బయటకు తవ్వించి పోస్టుమార్టం నిమిత్తం తరలించి, అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు వెల్లడించారు. ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతుండగా, త్వరలోనే ఈ కేసుకు సంబంధించిన అన్ని వివరాలు బహిర్గతం చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.






