కొండగట్టు లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పూర్తి చేయాలి : ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

by Ratna Kumari |

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ పరిధిలో దిగువ కొండగట్టు ప్రాంతంలో గల లిఫ్ట్ ఇరిగేషన్ పనులను త్వరగా పూర్తి చేయాలని స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అసెంబ్లీ లో ప్రభుత్వాన్ని కోరారు.

కొండగట్టు లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పూర్తి చేయాలి : ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
X

దిశ, కొడిమ్యాల/ కొండగట్టు : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ పరిధిలో దిగువ కొండగట్టు ప్రాంతంలో గల లిఫ్ట్ ఇరిగేషన్ పనులను త్వరగా పూర్తి చేయాలని స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అసెంబ్లీ లో ప్రభుత్వాన్ని కోరారు. ఈ ఆలయం తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కావడంతో, ఇక్కడ నీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. నియోజకవర్గంలోని నారాయణపూర్ గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించాలని ఆయన అన్నారు. మండలంలోని నాచుపెల్లి జేఎన్టీయూ కళాశాలలో చదువుతున్న సుమారు రెండు వేల మంది విద్యార్థులు తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్నారని ఆయన ప్రస్తావించారు. లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేస్తే కళాశాల విద్యార్థులతో పాటు హిమ్మత్ రావు పేట, డబ్బు తిమ్మాయపల్లి, రాంసాగర్ గ్రామాల రైతులు కూడా తాగు,సాగునీటి ఇబ్బందుల నుండి బయటపడతారని ఆయన స్పష్టం చేశారు.

Next Story