- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గోదావరిఖనిలో కత్తితో దాడి.. ముగ్గురికి గాయాలు ఒకరి పరిస్థితి విషమం
గోదావరిఖనిలో కత్తితో దాడి చేయడంతో ముగ్గురికి గాయాలు అయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.

దిశ, గోదావరిఖని : మానవత్వం మార్చారు.. చిన్న తగాదాకి కత్తితో దాడి చేశాడు. అన్నదమ్ముల కుటుంబాల మధ్య గొడవ..కత్తితో దాడి. గోదావరిఖని మార్కండేయ కాలనీలో శుక్రవారం ఉదయం కొబ్బరి బోండాల కత్తితో దాడి చేయక ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. వివరాల్లోకి వెళ్తే.. గడి చర్ల సుమిత్ర, ప్రణయ్, కొమురమ్మ లను గడిచర్ల రామ్ దూద్ కత్తితో దాడి చేశాడు. అన్నదమ్ముల కుటుంబాల మధ్యనే ఈ గొడవ జరుగుతుంది. ఈ దాడికి గల కారణాలు ఇంటి ముందు ఎలా పెట్టి వ్యాపారం చేస్తుండగా కస్టమర్లు సిగరెట్లు తాగడంతో ఇంట్లోకి పొగ వస్తుందని కారణంగా ఈ గొడవలు జరిగాయని తెలుస్తోంది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కుటుంబ కలహాల నేపథ్యంలో అన్నదమ్ముల కొడుకు కత్తితో దాడి చేయడంతో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానికులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం కరీంనగర్లోని ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కుటుంబ వివాదాలే దాడికి కారణమై ఉంటాయని ప్రాథమిక సమాచారం. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో కలకలం రేగింది.






