- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరాలి
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరాలని ఆదేశించారు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్

దిశ, గంభీరావుపేట : రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరాలని ఆదేశించారు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి. గంభీరావుపేట మండల కేంద్రంలోని గాయత్రి ఫంక్షన్ హాల్ లో సోమవారం రోజున కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు హమీద్ ఆధ్వర్యంలో, స్థానిక ఎన్నికలపై కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. దీనికి ముఖ్యఅతిథిగా కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బడుగు బలహీన వర్గాలకు ఎన్నికల్లో పెద్దపీట వేసేలా బీసీ రిజర్వేషన్లు కల్పించారని తెలిపారు.
ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికీ వివరిస్తూ ముందుకు సాగాలని కార్యకర్తలకు సూచించారు. పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికీ తప్పకుండా న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. రానున్న మరో 10 సంవత్సరాలు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. లోకల్ బాడీ ఎన్నికల్లో అవకాశం రానివారు, సైతం ప్రస్తుతం అవకాశం వచ్చిన అభ్యర్థుల గెలుపునకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.






