కిడ్నాప్ కేసును 24 గంటల్లో ఛేదించిన పోలీసులు

by Bhanu |

వ్యక్తిని కిడ్నాప్ చేసి చిత్ర హింసలకు గురి చేసిన వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

కిడ్నాప్ కేసును 24 గంటల్లో ఛేదించిన పోలీసులు
X

దిశ, ముస్తాబాద్: వ్యక్తిని కిడ్నాప్ చేసి చిత్ర హింసలకు గురి చేసిన వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీస్ లు తెలిపిన వివరాల ప్రకారం.. మండలం లోని గూడూరు గ్రామానికి చెందిన మల్లయ్య అనే వ్యక్తి కనిపించడం లేదని మంగళవారం అతని భార్య ఫిర్యాదు మేరకు ఎస్సై గణేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మల్లయ్య సెల్ ఫోన్ ట్రేస్ చేసి కోరుట్లలో ఉన్నట్లు గుర్తించి కానిస్టేబుళ్లు రాజశేఖర్, ఖాసీంలు మల్లయ్యను కోరుట్ల నుండి తీసుకువచ్చి విచారించారు.

మల్లయ్య కొడుకు పర్శరాం మల్కపేట గ్రామానికి చెందిన బోయిని రాజేందర్ కి 30 లక్షలు అప్పు ఉండగా, పర్శరాం తిరిగి ఇవ్వడం లేదని కక్ష్య గట్టిన రాజేందర్ తన స్నేహితులు అయిన కలికోట రవి, సతీష్, సుమంత్ లతో కలిసి మల్లయ్య ను కిడ్నాప్ చేసి కోరుట్ల లో ఓ రూమ్ లో బంధించి కొట్టారు. డబ్బులు ఇవ్వకపోతే మల్లయ్య ని చంపేస్తామని బెదిరించినట్లు తెలిపారు. వెంటనే ఎస్సై గణేష్ నిందితులైన రాజేందర్, సతీష్ ,రవి లను గురువారం అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించాడు. నిందితుల్లో ఒక్కడైన సుమంత్ పరారీలో ఉన్నట్లు ఎస్సై తెలిపారు.

Next Story