ఖబర్దార్ కొప్పుల ఈశ్వర్.. నోరు ఉందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు

by Ratna Kumari |

నోరు ఉందని ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని, ప్రజల కోసం పనిచేస్తున్న తన పై మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మండిపడ్డారు.

ఖబర్దార్ కొప్పుల ఈశ్వర్.. నోరు ఉందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు
X
దిశ, ధర్మారం : నోరు ఉందని ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని, ప్రజల కోసం పనిచేస్తున్న తన పై మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మండిపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో సంక్షేమాన్ని మరిచిపోయారని మంత్రి అడ్లూరి అన్నారు. అప్పటి సీఎం కేసీఆర్ ప్రజా భవన్ నిర్మాణం చేసుకుంటే కేటీఆర్, హరీష్ రావులు జన్వాడలో ఫామ్ హౌస్ నిర్మాణం చేసుకున్నారని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న కొప్పుల ఈశ్వర్ ఏనాడు విద్యార్థుల సంక్షేమం కోసం కృషి చేయలేదని మంత్రి అన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హాయాంలో సంక్షేమానికి ఒక వసతిగృహం నిర్మించలేదని మంత్రి ఆరోపించారు.

మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తనపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం.. ధర్మారం మండలంలోని మిగులు భూములను పేద ప్రజలకు పంపిణీ చేస్తామని మంత్రి తెలిపారు. ఇప్పటికే ధర్మారం మండలంలోని బొమ్మ రెడ్డి పల్లి లో 79 ఎకరాలు ప్రభుత్వ భూమిని కబ్జాదారుల కబంధ హస్తాల నుంచి విడిపించామని నర్సింగాపూర్ లో అనర్హుల ఆధీనంలో ఉన్న ప్రభుత్వ భూములను తీసుకొని పేద ప్రజలకు పంపిణీ చేస్తామని మంత్రి తెలిపారు. 2023 ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రజాప్రతినిధిగా నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ ప్రజల కోసం పనిచేస్తున్నానని మంత్రి అన్నారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తనపై వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారని ప్రజల పక్షాన ఉన్న తనపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్న ఈశ్వర్ కు హితబోధ చేస్తున్నానని మంత్రి తెలిపారు.

Next Story