హుజురాబాద్‌కు నూతన సీఐగా టి. కరుణాకర్ బాధ్యతలు స్వీకరణ...

by Bhanu |   (  Updated:2025-05-08 10:12:00  IST  )

హుజురాబాద్‌కు నూతన సీఐగా టి. కరుణాకర్ బాధ్యతలు స్వీకరణ...
X

దిశ, హుజురాబాద్ రూరల్: హుజురాబాద్ పట్టణ పోలీస్ స్టేషన్‌కు కొత్త సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ)గా టీ. కరుణాకర్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈరోజే ఆయన పోలీస్ స్టేషన్‌లో విధుల్లో చేరారు. గతంలో ఇతర ప్రాంతంలో సేవలందించిన కరుణాకర్, ఇప్పటినుంచి హుజురాబాద్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు పూర్తి స్థాయిలో కృషి చేస్తానని వెల్లడించారు. ప్రజలు తమ సమస్యలను నిర్భయంగా పోలీసులకు తెలియజేయవచ్చని సూచించిన ఆయన, చట్టాన్ని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన కరుణాకర్‌కు ఎస్‌ఐలు, పోలీస్ సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. పట్టణంలో శాంతి భద్రతలు నెలకొనేలా తనవంతు కృషి చేస్తానని ఆయన అన్నారు.

Next Story