మంత్రి విజ్ఞప్తి మేరకు తిరుపతికి ప్రత్యేక రైలు

by Bhanu |   (  Updated:2025-06-12 16:24:40  IST  )

గత నెల మే 22 కరీంనగర్ రైల్వే స్టేషన్ పునఃప్రారంభం లో భాగంగా కరీంనగర్ నుండి తిరుపతికి వారంలో రెండు రోజులు కాకుండా అదనంగా మరో రెండు రోజులు పొడగించారు.

మంత్రి విజ్ఞప్తి మేరకు తిరుపతికి ప్రత్యేక రైలు
X

దిశ, కరీంనగర్ రూరల్ : గత నెల మే 22న కరీంనగర్ రైల్వే స్టేషన్ పునఃప్రారంభం నేపథ్యంలో, కరీంనగర్ నుండి తిరుపతికి ప్రత్యేక రైలు సేవలను పెంచారు. ఇప్పటివరకు వారంలో రెండు రోజులు మాత్రమే ఉన్న ఈ రైలు సేవలను, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి మేరకు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆదేశాలతో, రైల్వే అధికారులు మరో రెండు రోజులు అదనంగా పొడిగిస్తూ గురువారం షెడ్యూల్ విడుదల చేశారు.

జులై 6వ తేదీ నుండి జులై 28వ తేదీ వరకు, ప్రతి ఆదివారం రాత్రి 7.45కి తిరుపతి నుంచి బయలుదేరే రైలు, సోమవారం ఉదయం 10 గంటలకు కరీంనగర్‌కు చేరుకోనుంది. అదే విధంగా, సోమవారం సాయంత్రం 5.30కి కరీంనగర్ నుంచి బయలుదేరిన రైలు, మంగళవారం ఉదయం 8.25కి తిరుపతికి చేరుకుంటుంది. ఈ రైల్ సర్వీసులు రెగ్యులర్ సర్వీసులు తో సంబంధం లేకుండా ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడినవి కనుక ప్రయాణికులు గమనిచ్చవలసిందిగా అధికారులు కోరారు.

Next Story