- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆహార భద్రత ఏది..? ఐస్ క్రీమ్‌లో ఈగ.. అధికారుల నిర్లక్ష్యం..!
కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో ఓ వ్యక్తి తన కూతురికి కొన్న కుల్ఫీ ఐస్ క్రీమ్‌లో ఈగ కనిపించడంతో ఒక్కసారిగా కలకలం రేగింది.

దిశ, కాల్వ శ్రీరాంపూర్ : కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో ఓ వ్యక్తి తన కూతురికి కొన్న కుల్ఫీ ఐస్ క్రీమ్‌లో ఈగ కనిపించడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. కూతురు ఐస్ క్రీమ్ తింటున్న సమయంలో అందులో ఈగను చూసిన బాధితుడు షాక్‌కి గురయ్యాడు. వెంటనే ఐస్ క్రీమ్ బండి వద్దకు వెళ్లి ప్రశ్నించగా, అమ్ముతున్న వ్యక్తి నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు. "అది మాకు తెలియదు, ఫ్యాక్టరీలో తయారవుతాయి. కావాలంటే మరోటి తీసుకోండి" అని నిర్లక్ష్యంగా చెప్పినట్లు బాధితుడు ఆవేదన చెందాడు.
ఈ ఘటనతో పిల్లల ప్రాణాలతో ఆడుకుంటున్న ఐస్ క్రీమ్ యజమాన్యాలపై, అలాగే ప్రజల ఆరోగ్యంపై ఏమాత్రం శ్రద్ధ చూపని ఫుడ్ సేఫ్టీ అధికారుల పర్యవేక్షణ లోపంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇలాంటి సంఘటనలు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతున్నా, సంబంధిత అధికారులు మాత్రం కళ్ళు మూసుకున్నారని బాధితుడు మండిపడ్డాడు. ఇలాంటి ప్రమాదకర సంఘటనలు పునరావృతం కాకుండా, ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న ఐస్ క్రీమ్ వ్యాపారులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు.






