కాళేశ్వరం అప్పగించండి.. మూడు రోజుల్లో సాగునీరు అందిస్తాం.. జగదీశ్వర్ రెడ్డి

by Bhanu |

రాష్ట్రంలో రైతులకు సాగునీరు ఇవ్వలేని కాంగ్రెస్ ప్రభుత్వం అన్నదాతలను ఇబ్బందులకు గురి చేస్తోందని, కావాలంటే కేసీఆర్ చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టును అప్పగిస్తే కేవలం మూడు రోజుల్లోనే ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తానని మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి హెచ్చరించారు.

కాళేశ్వరం అప్పగించండి.. మూడు రోజుల్లో సాగునీరు అందిస్తాం.. జగదీశ్వర్ రెడ్డి
X

దిశ, గోదావరిఖని : రాష్ట్రంలో రైతులకు సాగునీరు ఇవ్వలేని కాంగ్రెస్ ప్రభుత్వం అన్నదాతలను ఇబ్బందులకు గురి చేస్తోందని, కావాలంటే కేసీఆర్ చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టును అప్పగిస్తే కేవలం మూడు రోజుల్లోనే ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తానని మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి హెచ్చరించారు. ఆదివారం గోదావరిఖని లోని మాజీ ఎమ్మెల్యే చందర్ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

కేసీఆర్ పాలనలో తెలంగాణ అభివృద్ధి మార్గంలో నడిచిందని, కానీ రెవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత రాష్ట్రం తిరోగమనానికి గురైందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రెవంత్ రెడ్డి ముర్కపు పాలనతో ప్రజలను విసిగిస్తున్నారు. సాగునీటిని అందించకూడదనే కుట్రతోనే రైతాంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇదే తరహాలో సాగిపోతే రాష్ట్రం మళ్లీ సంక్షోభంలోకి వెళుతుందని ఆరోపించారు.

లక్షల ఎకరాలకు నీటిని అందించేందుకు కావాల్సిన సమస్త వనరులు కాళేశ్వరం జోన్ పరిధిలో సిద్ధంగా ఉన్నాయి. మెడిగడ్డ, అన్నారం, సుందిళ్ల, కన్నెపల్లి బ్యారేజీలు పూర్తిస్థాయిలో పనిచేస్తున్నాయి. వర్షాభావ పరిస్థితుల్లో కూడా బ్యారేజీల్లోని నీటి నిల్వలను వాడుకునే అవకాశాన్ని సర్కారు విస్మరిస్తోందని అన్నారు. రెవంత్ రెడ్డి ప్రభుత్వం నీటి పంపిణీ విషయంలో అసమర్థతను చూపుతుందని, రైతుల జీవితాలతో ఆడుకుంటోందని, అధికారంలో ఉండాల్సిన అర్హత కాంగ్రెస్ కు లేదని విమర్శించారు.

ఈ సమావేశంలో కౌశిక్ హరి, నడిపెల్లి మురళీధర్ రావు, పీటీ స్వామి, పెంట రాజేష్, బొడ్డు రవీందర్, నారాయణదాసు మారుతి, చిలకలపల్లి శ్రీనివాస్, అచ్చే వేణు, నూతి తిరుపతి, ఇంజపూరి నవీన్, జిట్టవేన ప్రశాంత్, ఇరుగురాళ్ల శ్రావన్, బుర్ర వెంకటేష్, చింటూ తదితరులు పాల్గొన్నారు.


Next Story