కరీంనగర్ జిల్లాలో కలకలం

by Thanuru Gopichand |

చొప్పదండి మండలంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.

కరీంనగర్ జిల్లాలో కలకలం
X

దిశ బ్యూరో కరీంనగర్ : చొప్పదండి మండలంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఒకే పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్న ఆరేళ్ల బాలికపై ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థి అసభ్యంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు సదరు బాలుడిపై పోక్సో కేసు నమోదు చేశారు. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన పాఠశాల ప్రాంగణంలోనే పసి హృదయాలు విషబీజాల వైపు మళ్లడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.

విద్యార్థుల భద్రతను గాలికి...

వేలకు వేల ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు పాఠశాలలు విద్యార్థుల భద్రతను గాలికి వదిలేస్తున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతటి అమానుష ఘటన జరిగినా పాఠశాల యాజమాన్యం తమకేమీ సంబంధం లేనట్లుగా వ్యవహరించడంపై గ్రామస్తులు భగ్గుమంటున్నారు. కేవలం ఫీజుల వసూళ్లపై ఉన్న శ్రద్ధ, క్రమశిక్షణ, పర్యవేక్షణపై లేకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని స్థానికులు మండిపడుతున్నారు. మరోవైపు ప్రైవేటు పాఠశాలల పర్యవేక్షణలో విద్యాశాఖ అధికారులు విఫలమయ్యారని, ఈ ఘటనపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దారుణమని ప్రజలు విమర్శిస్తున్నారు. పసిపాప భవిష్యత్తుకు భంగం కలిగించేలా ప్రవర్తించిన బాలుడిపై కఠిన చర్యలు తీసుకోవడంతోపాటు నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రైవేట్ పాఠశాల అనుమతులను తక్షణమే రద్దు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. పాఠశాల ఆవరణలో చిన్నారుల రక్షణకు హామీ లేకపోతే పంపడం ఎలా అని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Next Story