పాత్రికేయులు ఎప్పుడు ప్రజల పక్షమే

by velandi.Saikiran |

నిరంతరం వార్తలు సేకరించే పాత్రికేయులు ఎప్పుడు ప్రజల పక్షమే వహిస్తారని జువ్వాడి నర్సింగరావు అన్నారు.

పాత్రికేయులు ఎప్పుడు ప్రజల పక్షమే
X

దిశ, కోరుట్ల టౌన్: నిరంతరం వార్తలు సేకరించే పాత్రికేయులు ఎప్పుడు ప్రజల పక్షమే వహిస్తారని కాంగ్రెస్ కోరుట్ల నియోజకవర్గ ఇంచార్జి జువ్వాడి నర్సింగరావు అన్నారు. పట్టణంలోని జి జి ఆర్ ఫంక్షన్ హాల్లో కోరుట్ల ప్రెస్ క్లబ్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నర్సింగరావు, మున్సిపల్ కమీషనర్ రవీందర్ లు రిబ్బన్ కట్ చేసి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కోరుట్ల ప్రెస్ క్లబ్, ఐఎంఎ సంయుక్తంగా ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం ఆనందదాయకమన్నారు. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలన్నారు.

సుమారు 150 మందికి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైనమందులను ఉచితంగా అందించారు. ఈ ఐఎంఏ సభ్యులు వై అనుప్ రావు, స్వీతి అనుప్, రేగొండ రాజేష్, గండ్ర అన్వేష్, కోరుట్ల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ముక్కెర చంద్రశేఖర్, కాంగ్రెస్ నాయకులు తిరుమల గంగాధర్, అన్నం అనీల్, పాత్రికేయులు ఆకుల మల్లికార్జున్, శికారి రామకృష్ణ, గంగుల రామ్ గోపాల్, చావ్ల నవీన్, గజం శంకర్, సామల్ల శ్రీనివాస్, రాజేందర్, శ్రీనివాస్, నామాల రాకేష్, సాజిత్, అలీ, గంగాధర్, రమణ తదితరులు పాల్గొన్నారు.

Next Story