నారాయణపూర్ ముంపు బాధితులకు న్యాయం చేస్తాం : ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

by Nallavelli.Anjaneyulu |

నారాయణపూర్ రిజర్వాయర్ ముంపు బాధితులను అన్ని విధాలుగా ఆదుకొని వారికి న్యాయం చేస్తామని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భరోసా ఇచ్చారు.

నారాయణపూర్ ముంపు బాధితులకు న్యాయం చేస్తాం : ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
X

దిశ, గంగాధర : నారాయణపూర్ రిజర్వాయర్ ముంపు బాధితులను అన్ని విధాలుగా ఆదుకొని వారికి న్యాయం చేస్తామని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భరోసా ఇచ్చారు. రిజర్వాయర్ నిర్మాణం వల్ల ఇళ్లు కోల్పోయి పరిహారం మంజూరైన లబ్ధిదారులు శుక్రవారం గంగాధర మండలం మధురానగర్‌లోని ఎమ్మెల్యే ప్రజా కార్యాలయంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బాధితులు ఎమ్మెల్యేను శాలువాలతో సన్మానించి పరిహారం మంజూరు చేయించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నారాయణపూర్ గ్రామ నిర్వాసితుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి దశలవారీగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రతిపక్ష నాయకుల మాటలు నమ్మి గ్రామస్తులు ఆందోళనకు గురికావద్దని సూచించారు. రిజర్వాయర్ పరిధిలో ఉన్న ప్రతి నిర్వాసిత కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వచ్చే 15 రోజుల్లో నారాయణపూర్ గ్రామాన్ని స్వయంగా సందర్శించి గ్రామస్తులతో సమావేశమై సమస్యలను తెలుసుకుంటామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రామడుగు మల్లేశం, బాబు మల్లేశం, బుర్ర కిరణ్, గడ్డం కార్తిక్, రాగుల మల్లయ్య, నరాల శ్రీనివాస్, లోకిని తిరుపతి, బాబు నవీన్ పాల్గొన్నారు.

Next Story