కలెక్టరేట్‌ ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం..

by Bhanu |

కలెక్టరేట్‌లో ఉద్యోగం ఇప్పిస్తానంటూ లక్షల రూపాయలు వసూలు చేసి మోసం చేసిన ఘటనపై బాధితులు జగిత్యాల ప్రజావాణి

కలెక్టరేట్‌ ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం..
X

దిశ, జగిత్యాల: కలెక్టరేట్‌లో ఉద్యోగం ఇప్పిస్తానంటూ లక్షల రూపాయలు వసూలు చేసి మోసం చేసిన ఘటనపై బాధితులు జగిత్యాల ప్రజావాణి గ్రీవెన్స్ కార్యక్రమంలో అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. పెద్దపల్లి జిల్లా అప్పన్నపేటకు చెందిన పిడుగు సరిత అనే మహిళ ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం— దుబ్బాకకు చెందిన తిరుపతి అనే వ్యక్తి తాను జగిత్యాల కలెక్టరేట్‌లో పని చేస్తున్నానని చెప్పాడు. పైగా కలెక్టర్‌తో దిగిన ఫోటోలు చూపిస్తూ నమ్మకాన్ని పెంపొందించాడు.


ఆమె కుమారుడికి పెద్దపల్లి కలెక్టరేట్‌లో ఔట్సోర్సింగ్ ఉద్యోగం ఇప్పిస్తానని హామీ ఇచ్చాడు. అతని మాటలు నమ్మిన సరిత అతడికి రూ. 1.30 లక్షలు ఇచ్చింది. అయితే ఆపై ఉద్యోగం ఏర్పాటు చేయకపోగా, అతను కనిపించకుండా తప్పించుకుంటున్నాడని తెలిపారు.

తిరుపతి ఆ ఒక్కరినే కాకుండా మరికొందరిని కూడా ఉద్యోగాల పేరుతో మోసం చేశాడని వారు అనుమానిస్తున్నారు. కలెక్టర్‌కి ఫిర్యాదు చేస్తూ, తనలాంటి మరెవరూ మోసపోవద్దని, తిరుపతిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు విజ్ఞప్తి చేశారు. ఫిర్యాదుతో పాటు, తిరుపతి కలెక్టర్‌తో దిగిన ఫోటోలు, ఫేక్ అపాయింట్‌మెంట్ లెటర్లు కూడా అధికారులకు సమర్పించారు.


Next Story