- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావుకు జీవన్ రెడ్డి లేఖ
18 క్వింటాళ్ల నిబంధన ఎత్తివేయాలని కోరుతూ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు కు లేఖ రాసినట్లు జీవన్ రెడ్డి

దిశ, జగిత్యాల ప్రతినిధి : మార్క్ ఫెడ్ ద్వారా జరుగుతున్న మొక్క జొన్న కొనుగోళ్ళలో 18 క్వింటాళ్ల నిబంధన ఎత్తివేయాలని కోరుతూ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు కు లేఖ రాసినట్లు మాజీ మంత్రి జీవన్ రెడ్డి తెలిపారు. గురువారం జగిత్యాల పట్టణంలోని మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన జీవన్ రెడ్డి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులు ఎకరాకు 18 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తామని అధికారులు చెబుతున్నట్లు జీవన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై స్పందించిన ఆయన ఈ విషయమై ఇదివరకే సంబంధిత శాఖ మంత్రికి లేఖ రాసినట్లు రైతులకు వివరించారు. కొనుగోలు పరిమితిని 30 క్వింటాళ్ల వరకు సడలించాలని కోరినట్లు తద్వారా రైతులు దళారులను ఆశ్రయించి నష్టపోకుండా చూడవచ్చని మంత్రి దృష్టికి లేఖ ద్వారా తీసుకు వెళ్లినట్లు పేర్కొన్నారు.
మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేయడాన్ని ప్రభుత్వం కొనసాగించడం హర్షణీయమని అయితే కేంద్రం సహకారంతో నా ఫెడ్ ద్వారా అపరిమితంగా కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని అవసరమైతే రాష్ట్ర మంత్రి ఈ విషయమై కేంద్రానికి సూచన చేయాలని కోరారు. రైతులు ఆన్లైన్‌లో స్లాట్ బుక్ చేసుకుని విక్రయించే విధానం దళారులను నిరోధిస్తుందని అభిప్రాయపడ్డారు. మరోవైపు అమెరికా నుండి మొక్కజొన్న దిగుమతులు జరగనున్నాయనే అంశంపై ఆందోళన వ్యక్తం చేసిన జీవన్ రెడ్డి అదే జరిగితే రాష్ట్రంలో మాత్రమే కాకుండా దేశంలోని మొక్కజొన్న రైతులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. కాబట్టి మొక్కజొన్న దిగుమతులు జరగకుండా కేంద్రం చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జున్ను రాజేందర్, అల్లాల రమేష్ రావు, ధరా రమేష్ బాబు, మంజుల రఘువీర్ తదితరులు పాల్గొన్నారు.






