- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీజేపీ, బీఆర్ఎస్ లది రెండు నాలుకల ధోరణి
స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుపై బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రెండు నాలుకల ధోరణి అవలంబిస్తున్నాయని జీవన్ రెడ్డి

దిశ, జగిత్యాల ప్రతినిధి: స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుపై బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రెండు నాలుకల ధోరణి అవలంబిస్తున్నాయని మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆరోపించారు. సోమవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిర భవన్ లో జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. బీసీ రిజర్వేషన్లు 42శాతం అమలుపై ఓ వైపు అన్ని పార్టీలు సానుకూలం తెలియజేస్తూనే.. మరో వైపు భాజపా, భారాస లు ద్వంద వైఖరి ప్రవర్తిస్తున్నాయని మండిపడ్డారు.
బీసీ రిజర్వేషన్లు అమలు అయితే కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ పేరు వస్తుందోనన్న బాధగ ఆ రెండు పార్టీల్లో కనిపిస్తుందని అయితే ఈ వ్యవహారంపై గవర్నర్ త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఇక మరోవైపు కాళేశ్వరం పై విచారణను సిబిఐకి అప్పగించడం పట్ల జీవన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన విచారణ సంస్థలు సిట్, సీబీ సీఐడి ఉన్నప్పటికీ పారదర్శకత కోసమే ప్రభుత్వం విచారణ బాధ్యతను సిబిఐకి అప్పగించిందని స్పష్టం చేశారు. రాజకీయంగా కక్షపూరిత ఉద్దేశం ఉంటే రాష్ట్ర విచారణ సంస్థలకే బాధ్యతలు అప్పగించేవారని కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి దురుద్దేశం లేదు కాబట్టి సిబిఐ కి అప్పగించినట్లు తెలిపారు.






