- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జగిత్యాలలో బీఆర్ఎస్ రాజ్యం...జీవన్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా, జగిత్యాలలో బీఆర్ఎస్ హయంలో జరిగిన దౌర్జన్యం ఇంకా కొనసాగుతుందని మాజీ మంత్రి జీవన్ రెడ్డి

దిశ, జగిత్యాల ప్రతినిధి: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా, జగిత్యాలలో మాత్రం బీఆర్ఎస్ హయంలో జరిగిన దౌర్జన్యం ఇంకా కొనసాగుతుందని మాజీ మంత్రి జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఇందిరా భవన్ లో మీడియాతో మాట్లాడిన జీవన్ రెడ్డి, కాంగ్రెస్ కార్యకర్తలపై పోలీసులు.. తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. ఇటీవల బాలేపల్లి గ్రామంలో కాంగ్రెస్ నాయకుడు, మాజీ సర్పంచ్ భూపతి రెడ్డి, రేవంత్ పై మాజీ ఉపసర్పంచ్ బొక్కల గంగారెడ్డి తన అనుచరులతో బండరాళ్ల తో దాడి చేసినట్లు జీవన్ రెడ్డి తెలిపారు. దీంతో గొడవను ఆపేందుకు మల్లేశం అనే వ్యక్తి పోలీసులకు డయల్ 100 ద్వారా సమాచారం ఇచ్చాడని పేర్కొన్నారు.
దాడి విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన రేవంత్ రెడ్డి పైనే పోలీసులు కేసు పెట్టి జ్యూడిషల్ కస్టడీకి తరలించడం హేయమైన చర్య అన్నారు. అంతటితో పోలీసులు ఆగకుండా, డయల్ 100 ద్వారా సమాచారం ఇచ్చిన మల్లేశంతో పాటు మధ్యవర్తిగా ఉన్న తిరుపతి అనే వ్యక్తిపై కేసులు పెట్టినట్లు ఆరోపించారు. అధికారంలో ఉన్నప్పటికీ కాంగ్రెస్ కార్యకర్తలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. అంతేకాకుండా జైలులో ఉన్న వ్యక్తి కుటుంబ సభ్యులను సైతం బెదిరిస్తున్నారన్న జీవన్ రెడ్డి, ఈ కేసును నిష్పక్షపాతంగా విచారణ జరపాలని డీఎస్పీ సిఐలను కోరినట్లు తెలిపారు. జగిత్యాలలో జరుగుతున్న పరిణామాలను సీఎం రేవంత్ రెడ్డి తో పాటు రాష్ట్ర డీజీపీ దృష్టికి తీసుకు వెళ్తానని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు.






