- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జగిత్యాలలో జీవన్ రెడ్డి ఫ్లెక్సీ చించివేత
జగిత్యాల పట్టణంలో ప్రజా ఆశీర్వాద సభకు ముందే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాత బస్టాండ్ కూడలిలో ఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్సీని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

దిశ, జగిత్యాల టౌన్ : జగిత్యాల పట్టణంలో ప్రజా ఆశీర్వాద సభకు ముందే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాత బస్టాండ్ కూడలిలో ఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్సీని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ప్రజా ఆశీర్వాద సభను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు బీఆర్ఎస్ నాయకులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్, జీవన్ రెడ్డి చిత్రాలతో ఉన్న ఫ్లెక్సీ పాత బస్టాండ్ కూడలిలో ఏర్పాటు చేశారు. అదే ఫ్లెక్సీలో జీవన్ రెడ్డి ఫోటోను లక్ష్యంగా చేసుకుని చింపివేయడం వివాదానికి దారి తీసింది. స్థానికుల కథనం ప్రకారం.. బైక్‌పై వచ్చిన కొందరు వ్యక్తులు ఈ పని చేసి వేగంగా అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటనపై జీవన్ రెడ్డి అనుచరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డుపైకి వచ్చి నిరసన చేపట్టారు. ఇదిలా ఉంటే.. జీవన్ రెడ్డి ఇంటి వద్ద బిఆర్ఎస్ జెండాలు లేవని చెప్పడంతో కొందరు అసహనం వ్యక్తం చేసి ఫ్లెక్సీని చింపివేసినట్లు, సభకు కేవలం ఒకరోజు మాత్రమే మిగిలి ఉండగా, ఇలాంటి ఘటన జరగడం పార్టీ వర్గాల్లో టెన్షన్ పెంచుతోంది.






