- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యూరియా కొరత..కేంద్రానిదే బాధ్యత -
కావాల్సిన దానికంటే తక్కువ ఉత్పత్తి కావడం తో యూరియా కొరత ఏర్పడిందని దానికి కేంద్రానిదే బాధ్యత అని జీవన్ రెడ్డి అన్నారు.

దిశ, రాయికల్: కావాల్సిన దానికంటే తక్కువ ఉత్పత్తి కావడం తో యూరియా కొరత ఏర్పడిందని దానికి కేంద్రానిదే బాధ్యత అని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు.రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మండలం లోని బోర్న పల్లి వంతెన వద్ద గోదావరి ఉదృతి పెరగడంతో మంగళ వారం రోజున మాజీ మంత్రి జీవన్ రెడ్డి పరిశీలించారు. అనంతరం మండల కేంద్రంలో మీడియా తో మాట్లాడుతూ రామగుండం ఎరువుల కర్మాగారం లో 8 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి కావాల్సి ఉందన్నారు. కానీ కేవలం 5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే ఉత్పత్తి అయిందని దీనికి కేంద్రానిదే బాధ్యత అని అని వెల్లడించారు. అంతే కాకుండా రామగుండం లో ఉత్పత్తి అయ్యే యూరియా లో 90 శాతం తెలంగాణకి కేటాయించకపోవడంతో యూరియా కొరత ఏర్పడిందని ఇది కేంద్ర మంత్రులు,బీజేపీ ఎంపీ ల బాధ్యత రాహిత్యమని మండిపడ్డారు.
బొర్నపల్లి వంతెన నిర్మాణం చేపట్టాలని మాజీ సిఎం కేసీఆర్ దృష్టికి తీసుకురాగా బ్రిడ్జి నిర్మాణం కి నిధులు మంజూరు చేశారని కమ్మునూర్, బొర్నపల్లి వంతెనలను దగ్గరుండి పర్యవేక్షించి నిర్మించడం నా రాజకీయ జీవితంలో అత్యంత సంతృప్తికరమైన విషయం అని గత బి ఆర్ ఎస్ రెండు పర్యాయాలు అధికారం చేపట్టిన కొత్త రేషన్ కార్డులు,డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేయలేదని కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే కొత్త రేషన్ కార్డులు,ఇందిరమ్మ ఇండ్లు,ఉచిత బస్సు,రేషన్ ద్వారా సన్న బియ్యం పంపిణి లాంటి గొప్ప కార్యక్రమాలు అమలు చేస్తుందని తెలిపారు.బిసి లకు 42 శాతం రిజర్వేషన్ కల్పించడం చారిత్రాత్మక నిర్ణయం అని అన్నారు.ఈ సమావేశంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోపి రాజీ రెడ్డి,నాయకులు గుర్రం మహేందర్ గౌడ్,మహిపాల్,రాజేష్,శ్రీకాంత్,గంగా రెడ్డి,రాజీవ్,జలపతి,నరసింహ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
- Tags
- jeevan reddy
- urea






