- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రజా సమస్యలు, అవినీతి, అక్రమాల పై పోరాటమే జనసేన లక్ష్యం : బేతి మహేందర్ రెడ్డి
తెలంగాణ ప్రజల గుండెల్లో నమ్మకాన్ని, యువతలో పోరాట స్ఫూర్తిని నింపి సమాజ మార్పుతో రాబోయే జమిలీ ఎన్నికల్లో సనాతన హైందవ ధర్మ రక్షణయే ఎజెండాగా ముందుకు సాగుతామని జనసేన పార్టీ కరీంనగర్ పార్లమెంట్ కో-ఆర్డినేటర్ బేతి మహేందర్ రెడ్డి పిలుపునిచ్చారు.

దిశ, కరీంనగర్ కలెక్టరేట్ : తెలంగాణ ప్రజల గుండెల్లో నమ్మకాన్ని, యువతలో పోరాట స్ఫూర్తిని నింపి సమాజ మార్పుతో రాబోయే జమిలీ ఎన్నికల్లో సనాతన హైందవ ధర్మ రక్షణయే ఎజెండాగా ముందుకు సాగుతామని జనసేన పార్టీ కరీంనగర్ పార్లమెంట్ కో-ఆర్డినేటర్ బేతి మహేందర్ రెడ్డి జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పిలుపునిచ్చారు. నగరంలోని వావిలాలపల్లి గుండ్ల హనుమాన్ దేవాలయం దగ్గర జనసేన పార్టీ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. ఈ సందర్భంగా బేతి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ జనసేన పార్టీ 2014లో మార్చ్ 14న పార్టీని పవన్ కళ్యాణ్ స్థాపించడం జరిగిందని, ఎన్ని అవమానాలు, ఇబ్బందులు, సమస్యలు ఎదురైనా మొక్కవోని దీక్షతో పార్టీని బలోపేతం చేస్తూ ముందుకు సాగుతూ నేడు జనసేన పార్టీ అంటే ప్రజల్లో ఒక నమ్మకం, విశ్వాసం పెరిగిందని, దానికి పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఎంతో కష్టపడ్డారని బేతి మహేందర్ రెడ్డి తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ కి అత్యంత సన్నిహితులుగా, దేశం హితం కోసం, సనాతన హైందవ ధర్మ రక్షణ కోసం పార్టీ ఎజెండాగా తీసుకొని రాబోయే జమిలీ ఎన్నికలకు పార్టీని ప్రతి గడప గడపకు తీసుకెళ్లాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.
ఇందులో భాగంగా పార్టీ ఉద్యమ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఈ నెల 17వ తేదీ వరకు కొనసాగుతుందని, ఈ సభ్యత్వాన్ని పవన్ కళ్యాణ్ అభిమానులు, జాతీయవాదులు, హిందూత్వవాదులందరు పార్టీ సభ్యత్వాన్ని తీసుకొని జనసేన పార్టీకి అండగా ఉండాలని బేతి మహేందర్ రెడ్డి కోరారు. ముఖ్యంగా స్థానికంగా ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యల పై పోరాటం చేస్తూ, అవినీతి అక్రమాల పై ప్రశ్నిస్తూ ప్రజల పక్షాన నిలబడాలని పవన్ కళ్యాణ్ జన సైనికులకు సూచించారని, దానిలో భాగంగా కరీంనగర్ లో అభివృద్ధి మాటున జరిగిన, జరుగుతున్న అనేక అవినీతి, అక్రమాలపై ప్రశ్నిస్తూ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతామని బేతి మహేందర్ రెడ్డి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కాసర్ల మధుకర్ రెడ్డి, వొడ్నల రాజు, సాధు మధుసూదన్ రెడ్డి, వావిలాల రోహిత్ రెడ్డి, టీ. రవీందర్ రెడ్డి, బేతి సురేందర్, బేతి రాజశేఖర్ రెడ్డి, నలుమాచు శ్రీనివాస్ రెడ్డి, చందు, వావిలాల రామ్ రెడ్డి, సురేష్ రెడ్డి, జగన్నాథ రెడ్డి. శ్రీపాల్, ఉమ్మెంతుల మాధవ రెడ్డి పాల్గొన్నారు.






