జనసేన సభ్యత్వ నమోదు చేసుకోండి : పార్లమెంట్ కోఆర్డినేటర్ బేతి మహేందర్ రెడ్డి

by Ratna Kumari |

జ‌న‌సేన స‌భ్య‌త్వం తీసుకొని.. రూ.5ల‌క్ష‌ల బీమా పొందండి అంటూ పార్లమెంట్ కోఆర్డినేటర్ బేతి మహేందర్ రెడ్డి పేర్కొన్నారు.

జనసేన సభ్యత్వ నమోదు చేసుకోండి :  పార్లమెంట్ కోఆర్డినేటర్ బేతి మహేందర్ రెడ్డి
X

దిశ, కరీంనగర్ కలెక్టరేట్ : జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించి, సభ్యత్వ నమోదుకు రూ.2 కోట్లు విరాళం అందించి, తొలి సభ్యత్వాన్ని పవన్ కళ్యాణ్ తీసుకున్నారని నూతనంగా నియామకమైన కరీంనగర్ పార్లమెంట్ సభ్యత్వ నమోదు కోఆర్డినేటర్ బేతి మహేందర్ రెడ్డి తెలిపారు. శుక్ర‌వారం ఏర్పాటు చేసిన విలేక‌ర్ల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ జనసేన పార్టీ భావ జాలాన్ని లోతుగా అర్థం చేసుకొని, పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా పని చేసేందుకు ఎవరైతే ముందుకు వచ్చి పార్టీ సభ్యత్వం తీసుకుంటారో వారికి రూ.5ల‌క్ష‌ల బీమా ఉంటుంద‌ని తెలిపారు.

జనసేన సభ్యత్వ నమోదులో ప్రైవేట్ ఉద్యోగులను, వివిధ రకాల యూనియన్ లను, వివిధ కుల సంఘాలను, చిన్న చిన్న వ్యాపారాలు, వీధి వ్యాపారులు, వర్తక, వాణిజ్య వ్యాపారాలు చేసుకునే వారి నుంచి కూలి పనులు చేసుకునే వారిదాకా, ముఖ్యంగా యువత, మహిళలను భారీ సంఖ్యలో ఈ సభ్యత్వ నమోదు ప్రక్రియలో భాగస్వామ్యం చేస్తామ‌ని తెలిపారు.బీమా ఇంత మొత్తం ఏ పార్టీ ఇవ్వ‌డం లేద‌ని.. జ‌న‌సేన పార్టీ భావ జాలాన్ని అర్థం చేసుకొని ఆశ‌యాల‌ను ముందుకు తీసుకెళ్లేవారే ముఖ్య‌మ‌ని.. అలాంటి వారే పార్టీకి అవ‌స‌ర‌మ‌ని బేతి మ‌హేంద‌ర్ రెడ్డి తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో జ‌న‌సేన నాయ‌కులు కందుల రాజీరెడ్డి, శివ రెడ్డి, పెంటాల మహేష్, పొన్నాల తిరుపతి, వోద్నాల రాజు, జంగ మహేష్, వీర్ల శ్రీనివాస్ రావు, సిరిసిల్ల రాము, కందకట్ల స్వరూప, చింటూ పాల్గొన్నారు.

Next Story