- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం.. PACS సెక్రటరీ సస్పెండ్
జగిత్యాల రూరల్ మండలంలోని కల్లెడ పిఎసిఎస్ సెక్రటరీ శేఖర్ ను జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ సస్పెండ్ చేశారు.

X
దిశ, జగిత్యాల, రూరల్: జగిత్యాల రూరల్ మండలంలోని కల్లెడ పిఎసిఎస్ సెక్రటరీ శేఖర్ ను జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ సస్పెండ్ చేశారు.. సోమవారం రోజు జిల్లా కలెక్టర్ ప్రసాద్ జగిత్యాల రూరల్ మండలంలో హబ్సిపూర్, సోమన్ పల్లి,గ్రామాల్లో ని కొనుగోలు కేంద్రాలను, ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సెంటర్ లోని ధాన్యం కుప్పలు కుప్పలుగా ఉండడంతో.. ధాన్యం కొనుగోలు వేగవంతం చేయడంలో నిర్లక్ష్యం వహించిన పిఎసిఎస్ సెక్రటరీ శేఖర్ ను సస్పెండ్ చేశారు.
అలాగే పిఎసిఎస్ లోని మొత్తం సిబ్బందిని మారుస్తూ సస్పెండ్ అయిన వ్యక్తి స్థానంలో జగిత్యాల సింగిల్ విండో సెక్రటరీ సిబ్బందికి బాధ్యతలు అప్పజెప్పారు. అంతేకాకుండా.. హబ్సిపూర్, సోమన్ పల్లి కొనుగోలు కేంద్రాలలోని ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
Next Story






