జిల్లా కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశం రసాభాస.. జువ్వాడి వర్సెస్ సుజిత్ రావు

by Bhanu |

జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన జిల్లా కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశం రసాభాస గా మారింది.

జిల్లా కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశం రసాభాస.. జువ్వాడి వర్సెస్ సుజిత్ రావు
X

దిశ, జగిత్యాల రూరల్ : జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన జిల్లా కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశం రసాభాస గా మారింది. సమావేశానికి పీసీసీ పరిశీలకుడిగా వచ్చిన విశ్వనాథన్ సాక్షిగా పార్టీ వర్గపోరు బయటపడింది. కోరుట్ల నియోజక వర్గ ఇన్చార్జి జువ్వాడి నరసింగరావు వర్గీయులు కల్వకుంట్ల సుజిత్ రావు వర్గీయుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. మెట్ పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని బి ఆర్ ఎస్ నుండి కాంగ్రెస్ లోకి వచ్చిన వ్యక్తికి ఎలా ఇస్తారని పార్టీ లో మొదటి నుండి ఉన్న వారికి అన్యాయం చేస్తారా అని జువ్వాడి వర్గీయులు వివాదం చేయగా అదే రీతిలో సుజిత్ రావు వర్గీయులు ఎదురు దాడి చేసారు.మెట్ పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ గోవర్ధన్ స్టేజి మీద కూర్చోవడం తో మొదలైన గొడవ ఒక దశలో కొట్టుకునే స్థితికి వచ్చింది. దీనితో గొడవ పెద్దదికాకముందే ప్రభుత్వ విప్ డి సి సి అధ్యక్షుడు లక్ష్మణ్ కుమార్ జోక్యం చేసుకుని వివాదాన్ని సద్దుమనిగేలా చేశారు.అనంతరం సుజిత్ రావు వర్గీయులు సమావేశాన్ని నుండి వెళ్ళిపోయారు.

పార్టీలు మారిన నువ్వా మాట్లాడేది : మెట్ పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ గోవర్ధన్ ..

సమావేశం నుండి బయటకి వచ్చిన మేట్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ గోవర్ధన్ మాట్లాడుతూ పార్టీ నీ నమ్ముకుని ఉన్న మాకు న్యాయం చేయడం లేదని పార్టీలు మారిన నువ్వా ప్రశ్నించేది అని మెట్ పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ గోవర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.పార్టీ టికెట్ ఇవ్వకుంటే ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఆ తర్వాత బి ఆర్ ఎస్ పార్టీ కి వెళ్ళిన విషయం నిజం కాదా బీజేపీ వాళ్ళతో కలిసింది నిజం కాదా పార్టీ లు మారిన నీకు ప్రశ్నించే హక్కు లేదని అన్నారు.


Next Story