రెండేళ్ల సుదీర్ఘ దీక్షకు విరమణ

by Ratna Kumari |

దిశ, జగిత్యాల టౌన్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పట్ల తనకున్న అభిమానాన్ని వినూత్న రీతిలో చాటుకున్నాడు జగిత్యాలకు చెందిన సట్ట సతీష్ అనే యువకుడు. 2024 జనవరి 22న

రెండేళ్ల సుదీర్ఘ దీక్షకు విరమణ
X

దిశ, జగిత్యాల టౌన్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పట్ల తనకున్న అభిమానాన్ని వినూత్న రీతిలో చాటుకున్నాడు జగిత్యాలకు చెందిన సట్ట సతీష్ అనే యువకుడు. 2024 జనవరి 22న అయోధ్యలోని రామ మందిరంలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట జరిగిన రోజు సట్ట సతీష్ పవన్ పై అభిమానంతో దీక్ష చేపట్టారు. తన అభిమాన నటుడు నాయకుడైన పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో గెలిచి పదవి చేపట్టేంతవరకు చెప్పులు ధరించనని నిర్ణయం తీసుకున్నాడు. అనుకున్నట్టే ఆయన చెప్పులు వేసుకోకుండానే దీక్ష కొనసాగిస్తూ వచ్చారు. అయితే ప్రభుత్వం ఏర్పాటు తర్వాత పవన్ కళ్యాణ్ ను కలిసే అవకాశం రాకపోవడంతో దీక్ష విరమించలేదు. ఈ నేపథ్యంలో మంగళవారం ఏపీలోని మంగళగిరిలో పవన్ కళ్యాణ్ ను కలిసిన సట్ట సతీష్ ఎట్టకేలకు అభిమాన నాయకుడిని కలిసి దీక్షను విరమించారు. ప్రజారాజ్యం పార్టీ అప్పటి నుంచి పవన్ వీరాభిమానిగా ఉన్న సతీష్ ను పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా అభినందించారు.

Next Story