- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జగిత్యాల బంద్.. పాక్షికం
by Kema Shiva Kumar |
రైతు జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు జగిత్యాలలో పాక్షికంగా బంద్ కొనసాగింది.

X
దిశ, జగిత్యాల రూరల్ : రైతు జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు జగిత్యాలలో పాక్షికంగా బంద్ కొనసాగింది. మిల్లర్ల దోపిడీని అరికట్టడంతో పాటు ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని కోరుతూ రైతు సంఘాల నాయకులు బందుకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. మరో వారం రోజుల్లో రోహిణి కార్తీ వస్తున్న తరణంలో ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలని రైతులు కోరారు. మళ్లీ పంట వేసే కాలం కావడంతో రైతులు పొలాల దగ్గర పని చేయాలో లేక కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు పడాలో అర్ధం కానీ పరిస్థితి నెలకుందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ బంద్ కు బీజేపీ నాయకులు పలు రైతు సంఘాల నాయకులు మద్దతును తెలిపారు.
Next Story






