- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అర్జంట్ అయితే ఆరు బయటకే.. టాయిలెట్స్ ఉన్నా వాటికీ తాళం
జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్ గ్రామంలోని ప్రభుత్వ హైస్కూల్ లో విద్యార్థుల పరిస్థితి దయనీయంగా మారింది.

దిశ, జగిత్యాల రూరల్ : జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్ గ్రామంలోని ప్రభుత్వ హైస్కూల్ లో విద్యార్థుల పరిస్థితి దయనీయంగా మారింది. పాఠశాల ఆవరణలో టాయిలెట్స్ ఉన్నప్పటికీ వాటిని వినియోగించుకోలేని పరిస్థితి తలెత్తింది. పాఠశాలలో టాయిలెట్ నిర్మాణం పూర్తయినా వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేయకపోవడంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. గర్ల్స్ టాయిలెట్స్ ముందు వాటర్ డ్రమ్ములు ఏర్పాటు నీటిని నింపుతున్నారు. ఇక బాయ్స్ టాయిలెట్స్ కు అయితే ఏకంగా తాళం వేశారు.
దీంతో బాయ్స్ తో పాటు మేల్ ఫ్యాకల్టీ సైతం అర్జంట్ అయితే ఆరు బయటకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. హైస్కూల్ లో మొత్తం 69 మంది విద్యార్థులు ఉండగా అందులో 33 బాయ్స్ ఉండగా36 మంది గర్ల్స్ స్టూడెంట్స్ ఉన్నారు. ఇదిలా ఉండగా పాఠశాల ప్రాంగణంలో బోర్ ఉన్నప్పటికీ రిపేర్ కారణంగా నిమిషం కంటే ఎక్కువ సేపు నడవడం లేదు. మరోవైపు అదే ప్రాంగణంలో ఉన్న ప్రైమరీ పాఠశాలలో టాయిలెట్స్ బ్రహ్మాండంగా నిర్మాణం పూర్తయినప్పటికీ కాంట్రాక్టర్ వాటికి తాళం వేశాడు. టాయిలెట్స్ కు సంబంధించిన బిల్స్ వస్తేనే తాళం తీస్తానని తెగేసి చెప్పడంతో విద్యార్థులు ఉగ్గ పట్టుకునే పరిస్థితి ఏర్పడింది.
ప్రైమరీ స్కూల్ లో మొత్తం 63 విద్యార్థులు ఉండగా 30 బాయ్స్,33 మంది గర్ల్స్ ఉన్నారు. పాఠశాల పక్కనే పల్లె ప్రకృతి వనం, చెట్లు తుప్పలు ఉండడంతో తరచూ పాములు వస్తున్నాయని విద్యార్థులు చెబుతున్నారు. టాయిలెట్స్ సమస్యకు పరిష్కారం చూపాల్సిందిగా విద్యార్థుల కోరుతున్నారు.






