- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కోర్టు ఆవరణ నుండి రిమాండ్ ఖైదీ పరార్
కోర్టు ఆవరణ నుండి రిమాండ్ ఖైదీ పరారైన ఘటన జగిత్యాలలో చోటు చేసుకుంది.

దిశ, జగిత్యాల టౌన్ : కోర్టు ఆవరణ నుండి రిమాండ్ ఖైదీ పరారైన ఘటన జగిత్యాలలో చోటు చేసుకుంది. జగిత్యాల సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న పెగడపల్లి మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన జున్ను ప్రసాద్ ను కొడిమ్యాల పిఎస్ లో నమోదైన మరో కేసు విషయంలో కోర్టు కానిస్టేబుల్ సాగర్ పిటి వారెంట్ తో జగిత్యాల కోర్టులో హాజరు పరిచారు.
కేసు డీటెయిల్స్ ను పరిశీలించిన మెజిస్ట్రేట్ నిందితుడు జున్ను ప్రసాద్ కు రిమాండ్ విధించారు. ఈ క్రమంలో ప్రసాద్ కుటుంబ సభ్యులతో కోర్టు ఆవరణలో మాట్లాడుతుండగా కోర్టు కానిస్టేబుల్ సాగర్ రిమాండ్ వారెంట్ తీసుకోవడానికి కోర్టు లోపలికి వెళ్ళాడు. ఇదే అదునుగా భావించిన జున్ను ప్రసాద్ కోర్టు కానిస్టేబుల్ సాగర్ కళ్ళుగప్పి పారిపోయాడు. పరారీలో ఉన్న నిందితుడు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇదిలా ఉండగా కస్టడీ నుండి ఖైదీ తప్పించుకోవడం చర్చనీయాంశంగా మారింది.






