మీ సేవ ద్వారానే ధర్మపురి ఆలయానికి ఐ ఎస్ ఓ గుర్తింపు..

by Kodari Anjali |

స్వీపర్ల సేవ ద్వారానే ఆలయానికి దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఐఎస్ఓ (ISO) గుర్తింపు లభించిందని మంత్రి లక్ష్మణ్ అన్నారు.

మీ సేవ ద్వారానే ధర్మపురి ఆలయానికి ఐ ఎస్ ఓ గుర్తింపు..
X

దిశ, ధర్మపురి: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మపురిలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో పనిచేస్తున్న స్వీపర్ల సేవ ద్వారానే ఆలయానికి దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఐఎస్ఓ (ISO) గుర్తింపు లభించిందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ధర్మపురి దేవాలయంలో పనిచేస్తున్న 15 మంది స్వీపర్లకు సంబంధించిన వేతన పెంపు ప్రొసీడింగ్లను మంత్రి లక్ష్మణ్ కుమార్ ఆదివారం ధర్మపురిలో అందజేశారు. ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో స్వీపర్లుగా పనిచేస్తున్న 15 మందికి గతంలో నెలకు రూ. 8వేల నుండి 9వేల వరకు చెల్లిస్తుండగా మంత్రి అడ్డూరి చొరవతో స్వీపర్ల వేతనాలు నెలకు రూ.12వేలకు పెంచుతూ ఇటీవల దేవాదాయ శాఖ డైరెక్టర్ హనుమంతరావు ఉత్తర్వులు జారీ చేశారు.

ఆలయ అభివృద్ధితో పాటు...

ఉత్తర్వుల ప్రకారం ఆలయంలో పనిచే స్తున్న 15మంది స్వీపర్ల వేతనాలు రూ. 12 వేలకు పెరిగింది. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి మాట్లాడుతూ గతంలో ఇచ్చిన మాట ప్రకారం ఆలయంలో పనిచేస్తున్న స్వీపర్ల వేతనాలు పెంచడం జరిగిందని మంత్రి తెలిపారు. శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి ఐఎస్ఓ గుర్తింపు రావడానికి స్వీపర్లు ప్రధాన భూమిక పోషించారని మంత్రి అన్నారు. ఆలయ అభివృద్ధితో పాటు ఉద్యోగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు. తమ వేతనాల పెంపు కృషి చేసిన మంత్రి అడ్లూరికి ఈ సందర్భంగా స్వీపర్లు కృతజ్ఞతలు తెలిపారు.

Next Story